Begin typing your search above and press return to search.
పవన్ లైఫ్ లోకి రేణు రీ-ఎంట్రీ
By: Tupaki Desk | 14 March 2016 1:54 PM ISTభార్య రేణూ దేశాయ్ తో విడిపోయినా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పిల్లలు అకీరా నందన్ - ఆద్యలకు సంబంధించిన పలు ఈవెంట్లకు హాజరవుతూ తండ్రిగా తన బాధ్యతలను నెరవేర్చుతూనే ఉన్నారు. ఇప్పుడు రేణూ మరోసారి పవన్ జీవితంలోకి వస్తోందని అనుకుంటున్నారు. అయితే ఇది నిజజీవితంలోకి కాదు.. సినిమా లైఫ్ లోకి రేణూ ఎంట్రీ ఇస్తోందనే టాక్ వినిపిస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ ను శరవేగంగా ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్.. వచ్చే నెల 8న దీన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు.
పవర్ స్టార్ ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్టు గురించి కూడా ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసినట్లే. ఎస్ జే సూర్య డైరెక్షన్ లో ఖుషీ సీక్వెల్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం ఇస్తున్నాడనే విషయం ఇప్పటికే తెలిసిందే. వీరిద్దరూ పలుమార్లు ముంబైలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా వేసుకున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. అనూప్ రూబెన్స్ ది హైద్రాబాద్.. డైరెక్టర్ ది చెన్నై. మరి ఈ ఇద్దరూ కలిసి ముంబై ఎందుకు వెళుతున్నారు.? అదే అసలు పాయింట్. ఎందుకంటే ఖుషీ2 కి నిర్మాతగా వ్యవహరించనున్నది రేణూ దేశాయ్ కావడంతో.. ఆమెకు మీటింగ్స్ లో పాల్గొనేందుకే ఇలా ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పూనేలో ఉంటున్న రేణూ దేశాయ్.. డైరెక్టర్ - మ్యూజిక్ డైరెక్టర్లతో ముంబైలో భేటీ అవుతున్నట్లు సమాచారం. గతంలో ఖుషీ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ గాను, క్రియేటివ్ అసోసియేట్ గాను వర్క్ చేశారు. ఇలా పవన్ సినిమా లైఫ్ లోకి రేణూ రీఎంట్రీ ఇచ్చినట్లు టాక్.