Begin typing your search above and press return to search.
ప్రీ వెడ్డింగ్ పార్టీలో రేణు దేశాయ్ సందడి
By: Tupaki Desk | 23 Dec 2020 9:43 AM ISTస్టార్ సింగర్ సునీత రెండవ పెళ్లికి సిద్దం అయ్యారు. డిజిటల్ మీడియా అధినేత అయిన రామ్ తో సునీత వివాహ నిశ్చితార్థం ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్ గా జరిగింది. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలో యంగ్ హీరో నితిన్ వీరికి ఫ్రీ వెడ్డింగ్ పార్టీని హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో ఏర్పాటు చేశాడు. నితిన్ కుటుంబంకు రామ్ సన్నిహితుడు. నితిన్ తో రామ్ కు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. ఆ కారణంగానే నితిన్ వీరిద్దరికి ఫ్రీ వెడ్డింగ్ పార్టీని ఇచ్చాడు. సినీ ప్రముఖులు కొందరు ఈ వేడుకలో పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సునీతతో ఆమెకు మంచి స్నేహం ఉంది. ఇద్దరి మద్య కొన్ని కామన్ పాయింట్స్ ఉండటం వల్ల కనెక్ట్ అయ్యాం అంటూ గతంలో వారు పేర్కొనడం జరిగింది. ఇద్దరి మద్య ఉన్న స్నేహం కారణంగా రేణు ఈ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనడం జరిగిందంటున్నారు. ఇంకా ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో సునీత చాలా సంతోషంగా కనిపించారు. లీక్ అయిన కొన్ని ఫొటోల్లో ఆమె హ్యాపీనెస్ క్లీయర్ గా కనిపించింది.