Begin typing your search above and press return to search.

బుల్లి తెర పార్వతి దేవిగా రేణుదేశాయ్‌

By:  Tupaki Desk   |   25 March 2021 10:00 AM IST
బుల్లి తెర పార్వతి దేవిగా రేణుదేశాయ్‌
X
హీరోయిన్ గా చేసిన సినిమాలు రెండే అయినా కూడ ఆ రేణు దేశాయ్‌ కి ఇప్పటికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. పవన్‌ కళ్యాణ్‌ ను పెళ్లి చేసుకుని ఆయన నుండి విడిపోయిన తర్వాత కూడా రేణు దేశాయ్ సోషల్‌ మీడియాలో మరియు ఇండస్ట్రీలో కొనసాగుతూ తనకంటూ సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకుంది. బుల్లి తెరపై ఇప్పటికే పలు సార్లు కనిపించిన రేణు దేశాయ్ ని మళ్లీ ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూస్తామా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెండి తెరపై రేణు దేశాయ్ ని చూసేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. ఈ లోపు మరోసారి బుల్లి తెరపై గెస్ట్‌ గా రేణు దేశాయ్‌ మారారు.

జీ తెలుగు కు రేణు దేశాయ్‌ బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం తెల్సిందే. లాక్ డౌన్ తర్వాత జీ తెలుగు కోసం యాడ్స్‌ కూడా చేశారు. తాజాగా 'రాధమ్మ కూతురు' అనే సీరియల్‌ లో పార్వతిదేవిగా గెస్ట్‌ రోల్‌ చేసింది. ఈ సీరియల్‌ లో అక్షర మరియు అరవింద్ ల రొమాన్స్‌ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇద్దరి మద్య కెమిస్ట్రీ చాలా బాగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీరియల్‌ లో భాగంగా వీరిద్దరు కలిసి పార్వతి దేవి పూజ చేయడంతో వారి పూజను మెచ్చిన పార్వతిదేవి దివి నుండి భువికి వస్తుంది. రేణు దేశాయ్‌ ఆ పార్వతి దేవిగా కనిపించబోతుంది. సీరియల్‌ లోని ఆ సీన్‌ కు సంబంధించిన వర్కింగ్ స్టిల్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పార్వతి దేవిగా రేణు దేశాయ్ లుక్‌ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. సీరియల్‌ క్రేజ్ పెంచేందుకు అప్పుడప్పుడు మేకర్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు.