Begin typing your search above and press return to search.

అది అకీరా జీన్స్ లోనే ఉంది: రేణు దేశాయ్

By:  Tupaki Desk   |   2 Jan 2019 11:25 AM IST
అది అకీరా జీన్స్ లోనే ఉంది: రేణు దేశాయ్
X
రేణు దేశాయ్ 'లవ్-అన్ కండిషనల్' పేరుతో ఒక పొయెట్రీ బుక్ ను రాసిన విషయం తెలిసిందే. ఈ బుక్ ప్రమోషన్ కోసం రేణు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో తన పుస్తకంలోని కవితలు తన భావాలని.. ప్రతి విషయాన్నీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ తో లింక్ పెట్టొద్దని కోరింది. అయినా పవన్ రిలేటెడ్ విషయాలపై ప్రశ్నలు మాత్రం ఆగడం లేదు.

ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో పవన్-రేణు ల తనయుడు అకీరా నందన్ భవిష్యత్తులో హీరో అవుతాడా అని ప్రశ్నిస్తే.. అకీరా ప్రస్తుతానికి అందరూ టీనేజ్ అబ్బాయిలు చేసే పనులన్నీ చేస్తున్నాడు. ఫుట్ బాల్ ఆడుతున్నాడు.. పియానో నేర్చుకుంటున్నాడు ఇంకా తనకిష్టమైన పనులు చేస్తున్నాడు. ఒకవేళ అకీరా నటుడు కావాలనుకుంటే ఎవ్వరూ కూడా ఆ ఆలోచనను దూరం చేయలేరు. అందుకంటే అకీరా జీన్స్ లోనే అది ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ లెక్కన రేణు అకీరా ఫిలిం డెబ్యూ విషయంలో ఫుల్ క్లారిటీతోనే ఉంది. అకీరా కనుక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే తనవైపునుండి ఫుల్ సపోర్ట్ ఇస్తుందన్న మాట.

ఇదిలా తనకు పవన్ మాజీ భార్య అనే ట్యాగ్ లేకుండా రేణు దేశాయ్ గానే ఇంటర్వ్యూ ఇవ్వాలనే కోరిక ఉందని తెలిపింది. కోరిక బాగానే ఉంది కానీ అదంతా సులభమైతే కాదు. రేణు దేశాయ్ ఇంటర్వ్యూ అనగానే అటూ ఇటూ తిరిగి ఏ టాపిక్ అయినా పవన్ దగ్గర ఆగుతుంది. లేదా పవన్- రేణు పిల్లల టాపిక్ వస్తుంది. మరి రేణు కోరుకునే ఆరోజు ఎప్పటికి వస్తుందో ఏమో.