Begin typing your search above and press return to search.

బాహుబలి జీతం.. బాగా తక్కువే

By:  Tupaki Desk   |   13 May 2017 2:08 PM IST
బాహుబలి జీతం.. బాగా తక్కువే
X
బాహుబలి మహత్తర విజయం ఇప్పుడు బాహుబలికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ గొప్ప ఉపశమనం. ఎందుకంటే 5 ఏళ్ళు ఒక సినిమా కోసం పనిచేసి ఆ ఫలాలును ఆనందిస్తున్నారు. ఇండియాలో కనీవినీ ఎరుగని నెంబర్ కు కలక్షన్లు చేరాయి. మొత్తం ఫిల్మ్ బిజినెస్ నెంబర్ గేమ్ మారిచ్చి మరో కొత్త గమనం లోకి సినిమాను నెట్టి తరవాత వాళ్ళకి అతికష్టతర గమ్యం ఏర్పాటు చేసింది.

కాకపోతే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ జీతాలు చూస్తే కాస్త షోకింగ్ గానే ఉన్నాయి. బాలీవుడ్ హీరోలుతో పోల్చుకుంటే కొంచం నిరాశపరిచాయి. ఒక సినిమాకు బాలీవుడ్ వాళ్ళు తీసుకున్న జీతంలో సగం ఉంది. 1000 కోట్లు వసూలు చేసిన సినిమాకి పని చేసిన వాళ్ళ జీతాలు ఒకసారి చూద్దాం. ముఖ్య పాత్రదారి ప్రభాస్ కు 25 కోట్లు ఇచ్చారట. బాహుబలి డైరక్టర్ అండ్ సృష్టికర్త రాజమౌళికి అత్యధికంగా 28 కోట్లుతో పాటు కొంత లాభాలలో వాటా కూడా ఇచ్చారట. ఇక పోతే ప్రతినాయకుడు రానా కు 15 కోట్లు అనుష్క శెట్టికి తమ్మన్నా కు చేరో 5 కోట్లు రమ్య కృష్ణ కి 2.5 కోట్లు సత్యరాజ్ కి 2 కోట్లు ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా ఇప్పుడు ప్రకటించింది.

ఈ రేట్లు మన సినిమాల పరంగా చూసుకుంటే ఎక్కువేలే కాని.. కాకపోతే హింది వాళ్ళు ఒక సినిమా కు తీసుకున్న ఫీ బాహుబలి సినిమాకు బాహుబలి కాస్ట్ తీసుకున్న ఫీ చూస్తే మనవాళ్లు చాలా మంచివాళ్లే అని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/