Begin typing your search above and press return to search.

విజయ్ కు వంద కోట్లు ఇవ్వడంలో తప్పులేదు

By:  Tupaki Desk   |   25 Nov 2022 2:30 PM GMT
విజయ్ కు వంద కోట్లు ఇవ్వడంలో తప్పులేదు
X
తమిళ హీరో విజయ్ తన ప్రతి సినిమాకు కూడా మార్కెట్ స్థాయిని పెంచుకుంటూ వెళుతున్నాడు. ఏ దర్శకుడితో సినిమా చేసిన కూడా అతని క్రేజ్ ద్వారానే సినిమా మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. మిగతా భాషల్లో అతనికి పెద్దగా పట్టు లేకపోయినప్పటికీ కూడా సొంత భాషలోనే రారాజుగా కొనసాగుతున్నాడు. గత కొంతకాలంగా విజయ్ స్థాయిలో అయితే ఏ హీరో కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేయలేదు.

బీస్ట్ సినిమా థియేట్రికల్ గా నష్టాలను కలిగించి ఉండవచ్చు కానీ నిర్మాత అయితే ప్రాఫిట్ లోకే వచ్చాడు. ఎందుకంటే విజయ్ సినిమాలో పెట్టిన పెట్టుబడిని చాలా వరకు నాన్ థియేట్రికల్గానే వెనక్కి తీసుకు వస్తున్నాయి. ఆ రేంజ్ లో అతని మార్కెట్ వాల్యూ పెరుగుతోంది. ఇక వారసుడు సినిమా చేయడానికి కూడా ఇదే కారణం. దిల్ రాజు అతనికి 90 కోట్ల పారితోషికం ఎందుకు ఇచ్చాడో ఆ సినిమా బిజినెస్ పై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చాక అర్థమవుతుంది.

అయితే ఇప్పుడు విజయ్ స్థాయి ఇంకా ఏ రేంజ్ కు పెరిగిపోయిందో ఒక సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఒక విధంగా ఆ సినిమాకు డైరెక్టర్ సెట్ అవ్వడం కూడా కొంత హెల్ప్ అయ్యింది.

ఖైదీ మాస్టర్ సినిమాలతో డిఫరెంట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల విక్రమ్ సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద సరి కొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు అతను విజయ్ 67వ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు అప్పుడే నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ దాదాపు క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. డిజిటల్ కు సంబంధించిన అన్ని భాషల హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా సోనీ మ్యూజిక్ ఆడియో హక్కులను దక్కించుకుంది.

హిందీ శాటిలైట్ హక్కులను సెట్ మాక్స్ సోనీ దక్కించుకుంది. ఇక మొత్తంగా ఈ సినిమా నాన్ థియేట్రికల్గానే 250 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఈ కాంబినేషన్ కు విజయ్ ఈజీగా 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటాడు అని చెప్పవచ్చు. ఇక నిర్మాత దాదాపు టేబుల్ ప్రాఫిట్ తోనే సినిమాను విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.