Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్ మూవీ.. మ‌హేష్ పారితోషికం ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   6 May 2021 5:00 AM IST
త్రివిక్ర‌మ్ మూవీ.. మ‌హేష్ పారితోషికం ఎంతో తెలుసా?
X
టాలీవుడ్లో టాప్ స్టార్ గా వెలుగొందుతున్న హీరోల్లో ముందు వ‌ర‌స‌లో ఉంటాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. పారితోషికం విష‌యంలోనూ ప‌క్కాగా ఉంటాడు. త‌న బ్రాండ్ వాల్యూను బ‌ట్టి రెమ్యున‌రేష‌న్ ఫిక్స్ చేస్తుంటాడు. అయితే.. ఇటీవ‌ల‌ వ‌రుస హిట్ల‌తో దూకుడు మీదున్న మ‌హేష్.. త్రివిక్ర‌మ్ తో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో సినిమా రాబోతోంది. అత‌డు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌, ఖ‌లేజా వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత వ‌స్తున్న‌ మూవీ కావ‌డంతో.. ప్రిన్స్ అభిమానుల‌తోపాటు సాధార‌ణ ప్రేక్ష‌కుల్లోనూ మంచి అంచ‌నాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ నాటికి ఈ అంచ‌నాలు భారీగా పెరిగిపోవ‌డం ఖాయం.

కాబ‌ట్టి.. బిజినెస్‌ కూడా ఓ రేంజ్ లో సాగే ఛాన్స్ ఉంది. ఓపెనింగ్స్ కూడా భారీగా వ‌స్తాయి. అందుకే.. ఈ సినిమాకు గ‌ట్టిగా డిమాండ్ చేసిన‌ట్టు స‌మాచారం. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీకి రూ.60 కోట్లు డిమాండ్ చేశాడ‌ట మ‌హేష్‌. ఈ డీల్ కు మేక‌ర్స్ ఓకే అన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మే 31న ఈ సినిమాను అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి.. ఈ సినిమా ద్వారా మ‌హేష్ రెమ్యున‌రేష‌న్ మ‌రో హైట్స్ కి చేరింది.