Begin typing your search above and press return to search.

శ్వేతవర్మకు ఇచ్చిన రెమ్యునరేషన్ బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   18 Oct 2021 9:04 AM IST
శ్వేతవర్మకు ఇచ్చిన రెమ్యునరేషన్ బయటకొచ్చింది
X
తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది శ్వేతవర్మ. బలమైన కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్న ఈ ఫైర్ బ్రాండ్.. హౌస్ నుంచి బయటకు వచ్చేసిన నేపథ్యంలో.. ఆమెకు అందిన పారితోషికం ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు చిన్న చిత్రాల్లో నటించిన శ్వేతకు బిగ్ బాస్ షో.. ఆమెను మరింత పాపులర్ చేసిందని చెప్పాలి. ఇంతకాలం ఆమె కష్టపడినా రాని ఫలితం.. బిగ్ బాస్ పుణ్యమా అని వచ్చిందని చెప్పాలి.

బిగ్ బాస్ ప్లాట్ ఫాం మీద అవకాశం లభించటమే ముఖ్యమన్నట్లుగా భావించేవారెందరో. అలాంటి వారు బిగ్ బాస్ ఇచ్చే పారితోషికం గురించి ఆలోచించకుండా.. తమ కెరీర్ కు దీన్నో నిచ్చెనలా వాడుకోవటం కనిపిస్తుంది. ఇందులో అవకాశం లభించాలే కానీ.. మిగిలిన ప్రాజెక్టుల్ని పక్కన పెట్టేసి వచ్చేయటం కనిపిస్తుంది. దీనికి తగ్గట్లే.. బిగ్ బాస్ నిర్వాహకులు సైతం తాము ఎంచుకున్న వారి కోసం ఎక్కువ మొత్తంగా పారితోషికాల్ని ఇవ్వటానికి సైతం వెనుకాడరు.

ఇక.. శ్వేతవర్మ విషయానికి వస్తే.. ఈ షోలో అడుగుపెట్టిన వేళలో.. కాస్త కామ్ గా ఉన్న ఆమె.. తర్వాతి కాలంలో టాస్కుల్లో చెలరేగిపోవటమే కాదు..కొన్నిసార్లు హద్దులు దాటిన ఆగ్రహంతో చెలరేగిపోయింది. అమర్యాదగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు కంటెస్టెంట్లకు షాకిచ్చింది. తాజాగా ఎలిమినేట్ అయిన శ్వేతవర్మ విషయానికి వస్తే ఈ షో ద్వారా ఆమెకు ఎంత ముట్టజెప్పారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాదానం లభిస్తోంది.
విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఆమెకు వారానికి రూ.60వేల నుంచి రూ.90 వేల మధ్యలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దాదాపు ఆరు వారాల పాటు సాగిన ఆమె బిగ్ బాస్ జర్నీ ద్వారా రూ.5 లక్షల వరకు ఇచ్చారని చెబుతున్నారు. నిజానికి శ్వేతవర్మకు వచ్చిన పారితోషికం కంటే కూడా.. ఈ షో ద్వారా ఆమెకు లభించిన పేరు ప్రఖ్యాతులు.. ప్రజల్లో పెరిగిన పాపులార్టీ ఆమెకు మరిన్ని అవకాశాలకు కారణమవుతుందని చెప్పక తప్పదు.