Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోల క్రేజ్ ని బట్టి రేట్స్...!

By:  Tupaki Desk   |   5 Sep 2020 1:30 AM GMT
టాలీవుడ్ హీరోల క్రేజ్ ని బట్టి రేట్స్...!
X
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ పెంచుకుంటున్నారు. కేవలం తెలుగు ప్రేక్ష‌కుల‌కే ప‌రిమిత‌మ‌వకుండా ఇత‌ర భాష‌ల్లోనూ సినిమాలు విడుద‌ల చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ హీరోలకు ధీటుగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ తెలుగు సినిమా స్టామినాని తెలియజేస్తున్నారు. ఇక ఓవర్ సీస్ లో కూడా దుమ్ముదులిపే కలెక్షన్స్ రాబడుతూ మన తెలుగు హీరోలు ఇతర ఇండస్ట్రీ వారు అవాక్కయేలా చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా సినిమాకి క్రేజ్ పెంచుకుంటూపోతూ.. దానికి తగ్గట్టే రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు. సినిమా బడ్జెట్ ని బట్టి పారితోషకం తీసుకోవడంతో పాటు సినిమాకి వచ్చే లాభాల్లో కూడా వాటాలు.. కొన్ని ఏరియాల రైట్స్ తీసుకుంటున్నారు.

కాగా టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున - బాలయ్య - వెంకటేష్ లు ఎప్పటి నుంచో రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో షేర్ తీసుకుంటూ వస్తున్నారు. ఇక టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. అదే రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. 'రాధే శ్యామ్' సినిమాని హోమ్ బ్యానర్ లో ఫ్రెండ్స్ తో కలిసి చేస్తున్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ మరియు 'ఆదిపురుష్' సినిమాలకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. నాగ్ అశ్విన్ సినిమా కోసం సుమారు 80 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్.. 'ఆదిపురుష్' కోసం రెమ్యూనరేషన్ తో పాటు తెలుగు రైట్స్ కూడా తీసుకుంటున్నాడని అనుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకి రెమ్యూనేషన్ డిసైడ్ చేసి మూవీ కలెక్షన్స్ లో షేర్ తీసుకుంటారని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ ఏడాది హిట్ అందుకోవడంతో రేట్ పెంచేసాడట. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న 'పుష్ప' సినిమా నిర్మాణంలో తన రిలేటివ్స్ ని భాగం చేయడమే కాకుండా సుమారు 35 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లోని రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత భారీగానే తీసుకుంటున్నాడని అంటున్నారు. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి 50 నుంచి 55 కోట్ల వరకు తీసుకున్నాడట. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు సైతం 30 నుండి 35 కోట్ల వరకు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.