Begin typing your search above and press return to search.
విరూపాక్షలో అరవ శివ అంతా ఉత్తదేనట!
By: Tupaki Desk | 2 May 2020 12:45 PM ISTపవన్ కళ్యాణ్.. క్రిష్ ల కాంబోలో రూపొందబోతున్న చిత్రంకు విరూపాక్ష అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ పవన్ లేకుండానే ఒక షెడ్యూల్ ను క్రిష్ పూర్తి చేశాడు. పవన్ జాయిన్ అవ్వబోతున్నాడనగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ అయితే ఆగిపోయింది కాని సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం మీడియాలో వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారని.. హీరోయిన్ ఎంపిక చేశారంటూ పలు వార్తలు వచ్చాయి.
ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన వార్త ఈ సినిమాలో తమిళ ట్యాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ నటించబోతున్నాడు.. ఆయనకు ఇటీవలే క్రిష్ స్క్రిప్ట్ వినిపించాడు అనే వార్త. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరగడంతో అందరు ఆతృతగా ఎదురు చూశారు. అయితే అసలు విషయం ఏంటంటే అసలు పవన్ 27 చిత్రం కోసమే కాని అసలు ఏ తెలుగు సినిమా కోసం కూడా శివ కార్తికేయన్ ను ఎవరు సంప్రదించలేదట.
ఈ విషయాన్ని శివ కార్తికేయన్ పీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. తెలుగు నుండి ఎలాంటి ఆఫర్ రాలేదని.. ప్రస్తుతానికి తమిళంలోనే వరుసగా చిత్రాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. దాంతో విరూపాక్ష చిత్రం గురించి వస్తున్న వార్తలన్ని కూడా ఉత్తుత్తి వార్తలనే అని క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ విషయమై కూడా వార్తలు వచ్చాయి. జాక్వెలిన్ ఫెర్నాడెస్ నటించబోతుందన్నారు. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ హిందీలో జాన్ అబ్రహంతో తప్ప మరే సినిమాకు ఇప్పటి వరకు కమిట్ కాలేదంటూ పేర్కొంది. దాంతో ఈ చిత్రంలో ఆమె ఇంకా కన్ఫర్మ్ కాలేదని క్లారిటీ వచ్చేసింది.
ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రంను దాదాపుగా పూర్తి చేసిన పవన్ లాక్ డౌన్ ఎత్తివేసి షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చిన వెంటనే క్రిష్ కు డేట్లు ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందబోతున్న ఈ చిత్రంలో పవన్ దొంగగా కనిపిస్తాడట. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.