Begin typing your search above and press return to search.

పవన్ సినిమాలో మరో స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   27 April 2020 12:20 PM IST
పవన్ సినిమాలో మరో స్టార్ హీరో..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పిరియాడిక్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే బందిపోటు పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఈ సినిమా కథ హాలీవుడ్ రాబిన్ హుడ్ తరహాలో సాగుతుందని సమాచారం. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. పాపులర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్‌ నటించనుందట.

ఇక సెకండ్ హీరోయిన్‌గా నివేదా పేతురాజ్‌ను అనుకుంటున్నారని టాక్. నివేద ఇటీవలే అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' నటించి తన అందచందాలతో అదరగొట్టింది. అయితే ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న విరూపాక్ష షూటింగ్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. ఇక ఓ ఐటెమ్ సాంగ్‌లో తెలుగమ్మాయి పూజిత పొన్నాడ కనిపించనుందట. భారీ సెట్లో ఇప్పటికే పూజితపై సాంగ్ షూటింగ్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త హల్చల్ చేస్తోంది. తమిళ యంగ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించనున్నాడట. ఇప్పటికే శివ కార్తికేయన్ తో ఒప్పంద సమావేశాలు సక్సెస్ అయినట్లు సమాచారం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల చేయాలనీ చిత్రబృందం ప్లాన్ చేస్తోందట.