Begin typing your search above and press return to search.

బన్నీ డ్యాన్స్ నంబర్ ని రీమిక్స్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి..!

By:  Tupaki Desk   |   26 April 2021 4:40 PM GMT
బన్నీ డ్యాన్స్ నంబర్ ని రీమిక్స్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి..!
X
కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ''రాధే - యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌'' సినిమా మే 13న థియేటర్స్‌ తో పాటుగా పే పర్ వ్యూ విధానంలో ఓటీటీలో ఒకేసారి రిలీజ్ అవుతోంది. సల్మాన్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించిన ఈ చిత్రాన్ని కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ 'సీటీమార్' సాంగ్ ను రీమిక్స్ చేశారు. అల్లు అర్జున్ నటించిన 'డీజే' సినిమాలోని ఆ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేవిశ్రీ ట్యూన్.. బన్నీ స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ కలిసి ఈ పాటను ఎవర్ గ్రీన్ డ్యాన్స్ నంబర్ గా నిలిపాయి. అయితే ఇప్పుడు హిందీ సీటీమార్ సాంగ్ ని వదిలారు.

'రాధే' చిత్రంలోని 'సీటీమార్' పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. యూట్యూబ్ లో విడుదలైన ఈ పాట సల్మాన్ ఖాన్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే 'డీజే' సినిమాలోని ఒరిజినల్ సాంగ్ ను చూసిన ప్రేక్షకులు మాత్రం పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. బన్నీ గ్రేస్ తో స్టైలిష్ స్టెప్పులు వేయగా.. ఇక్కడ సల్మాన్ సింక్ లేకుండా తనదైన శైలిలో డ్యాన్స్ చేసాడని నెగిటివ్ కామెంట్స్ చేశారు. దిశాపటానీ డ్యాన్స్ మూవ్ మెంట్స్ తప్పిస్తే ఇందులో మిగతా ఏమి బాలేదని అంటున్నారు.

55 ఏళ్ల సల్మాన్ స్టెప్పులతో అల్లు అర్జున్ డాన్స్ ని పోల్చడం కరెక్ట్ కానప్పటికీ.. ఆయన వేసిన సింపుల్ కదలికలు కూడా సెట్ కాలేదనే కామెంట్స్ వస్తున్నాయి. కనీసం సీటీమార్ లిరిక్ కి తగ్గట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదని అంటున్నారు. జానీ మాస్టర్ సల్మాన్ బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని కొరియోగ్రఫీ చేసినప్పటికీ.. సల్మాన్ ఫాస్ట్ బీట్ ని అందుకునేలా స్టెప్స్ వేయలేకపోయారు. ఈ నేపథ్యంలో సల్మాన్ - బన్నీ డ్యాన్స్ వీడియోలను పోలుస్తూ మీమ్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం 'సీటీమార్' ప్రో.. సీటీమార్ లైట్ టైప్ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.