Begin typing your search above and press return to search.

26/11 దాడుల్ని గుర్తు చేస్తూ.. స్టార్లంతా అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు!

By:  Tupaki Desk   |   29 Nov 2020 3:00 PM IST
26/11 దాడుల్ని గుర్తు చేస్తూ.. స్టార్లంతా అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు!
X
ఆర్థిక రాజ‌ధాని ముంబైలో `గేట్వే ఆఫ్ ఇండియా` ప్రాధాన్య‌త గురించి తెలిసిందే. ఎంతో సెన్సిటివ్ ప్లేస్ ఇది. ఈ చోటుకు ఉండే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. బెస్ట్ టూరిస్ట్ హ‌బ్ గానూ ఈ స్థ‌లం పాపుల‌రైంది.

అలాంటి సెన్సిటివ్ ప్లేస్ లో ప‌లువురు బాలీవుడ్ స్టార్లు ప్ర‌త్య‌క్ష‌మై స‌ర్ ప్రైజ్ చేశారు. దీపికా పదుకొనే - అనన్య పాండే- సిద్ధాంత్ చతుర్వేది షకున్ బాత్రా త‌దిత‌రులు షూటింగుల అనంత‌రం గేట్వే ఆఫ్ ఇండియాలో కనిపించారు.

దీపికా - అనన్య పాండే - సిద్ధాంత్ చతుర్వేది ఇప్పుడు శకున్ బాత్రా చిత్రంలో కనిపించనున్నారు. ఇంకా ఈ మూవీకి టైటిల్ నిర్ణ‌యించాల్సి ఉంది. శనివారం గేట్వే ఆఫ్ ఇండియాలో వీరంతా కలిసి కనిపించడానికి కార‌ణం షూటింగ్ అని తెలిసింది. ఆరోజు షూట్ ప్యాక్ అప్ తర్వాత ముగ్గురు అలీబాగ్ నుండి తిరిగి వచ్చినట్లు సమాచారం. కరోనావైరస్ మహమ్మారి భ‌యాల న‌డుమ ముందస్తు చర్యగా ముగ్గురూ ముసుగులు ధరించి క‌నిపించారు.

ఈ మూవీ బృంద సభ్యుల కోసం దీపావళి విందును ఏర్పాటు చేయ‌గా.. ఆ ముగ్గురూ సిద్ధాంత్ నివాసంలో క‌లిసారు. దీపిక -అన‌న్య‌-ఇషాన్ ఖట్టర్ ఆ పార్టీలో క‌లిసారు.

ఫిల్మ్ షూట్ తర్వాత షకున్ బాత్రా బృందం గత నెలలో గోవా నుండి తిరిగి వచ్చింది. కొనసాగుతున్న మహమ్మారి మధ్య ప్రయాణ మార్పుల కారణంగా వారు శ్రీలంకకు బ‌దులుగా గోవాను ఎంచుకోవలసి వచ్చిందట‌. ఇంత‌కుముందు పాక్ ముష్క‌ర తీవ్ర‌వాదులు గేట్ వే ఆఫ్ ఇండియా ప‌రిస‌రాల నుంచే ఎస్కేప్ అయ్యి న‌గ‌రంపై దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. 26/11 దాడుల్ని ఎప్ప‌టికీ మ‌రువ‌లేం. ఈ టెర్ర‌ర్ ఎటాక్స్ లో చ‌నిపోయిన వారిని సంస్మ‌రించుకునేందుకు ముంబై జ‌నాలు గేట్ వేకి విచ్చేయ‌డం వార్తా క‌థ‌నాల్లో హైలైట్ అయ్యింది. ఇదే సంద‌ర్భంలో అక్క‌డ స్టార్లు ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.