Begin typing your search above and press return to search.

టాప్ 10 లో మనోళ్లు ఇద్దరు.. మొదటి రెండు వాళ్లవి

By:  Tupaki Desk   |   23 Aug 2021 11:59 AM GMT
టాప్ 10 లో మనోళ్లు ఇద్దరు.. మొదటి రెండు వాళ్లవి
X
ఇండియాలో ట్విట్టర్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వారు.. సినిమాలకు సంబంధించిన విషయాలను ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ ఏడాదిలో ట్విట్టర్ లో అత్యధికంగా ట్రెండ్‌ అయిన హ్యాష్ ట్యాగ్స్ ఏవీ అంటూ ట్విట్టర్ ఇండియా వారు 'ఇండియాస్‌ మోస్ట్‌ ట్వీటెడ్‌ హ్యాష్‌ ట్యాగ్స్‌' అంటూ టాప్ 10 జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఇద్దరు తెలుగు హీరోలకు చోటు దక్కింది. కాని ఇక్కడ కాస్త నిరాశ కలిగే విషయం ఏంటీ అంటే తమిళ హీరోలు నటించిన వాలిమై మరియు మాస్టర్ సినిమాలు టాప్‌ 2 లో ఉన్నాయి. మొదటి స్థానంను ఇంకా విడుదల అవ్వని వాలిమై దక్కించుకోగా.. విజయ్‌ నటించిన మాస్టర్‌ సినిమా గురించి ట్విట్టర్ లో అత్యధికులు హ్యాష్ ట్యాగ్ తో చర్చించారు.

మొదటి రెండు స్థానాలను తమిళ హీరోలు అజిత్ మరియు విజయ్‌ లు దక్కించుకోగా మూడవ స్థానంలో మన సూపర్‌ స్టార్‌ ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా దక్కించుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుండి మొదలుకుని జూన్‌ 30 వరకు నమోదు అయిన హ్యాష్‌ ట్యాగ్స్ ను ట్విట్టర్‌ లెక్కించినట్లుగా చెబుతున్నారు. నెం.3 లో సర్కారు వారి పాట ఉండగా నెం.4 స్థానంను అజిత్ కుమార్‌ దక్కించుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ నటిస్తున్న సినిమా తలపతి65 హ్యాష్‌ ట్యాగ్‌ నిలిచింది. ట్విట్టర్‌ లో ఆవర స్థానంలో ఐ హేట్ అవార్డ్స్ హ్యాష్ ట్యాగ్ నిలిచింది. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా పదవ స్థానంలో నిలిచింది.

టాప్ 10 లో తమిళ స్టార్స్ కు చెందిన నాలుగు హ్యాష్ ట్యాగ్స్ స్థానం దక్కించుకోగా.. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోల సినిమాలు సర్కారు వారి పాట మరియు వకీల్‌ సాబ్ మాత్రమే నిలిచాయి. కోవిడ్ 19 హ్యాష్ ట్యాగ్‌ 9వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో బాలీవుడ్‌ స్టార్స్ కాని వారి సినిమాలు కాని ఏమీ లేకపోవడం విడ్డూరం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సౌత్‌ ఆడియన్స్ తమ అభిమాన హీరోల గురించి సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో ఏ రేంజ్ లో చర్చిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.