Begin typing your search above and press return to search.
రిలీజ్ ప్రోటోకాల్: ఆ మూడు కేటగిరీలపై మల్లగుల్లాలు!
By: Tupaki Desk | 10 July 2021 8:00 PM ISTతెలంగాణలో 100శాతం ఆక్యుపెన్సీ.. ఆంధ్రాలో 50శాతం ఆక్యుపెన్సీతో సినిమాల్ని రిలీజ్ చేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. రిలీజ్ చేసేదెవరు? థియేటర్లు తెరిచేదెపుడు? ఇదీ సందిగ్ధత.
ఈ నెల 23 (శుక్రవారం) నుంచి థియేటర్లను తెరుస్తారు! అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తెరిస్తే గనుక అప్పటికి ఇరు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్ లు కలిపి 1700 థియేటర్లకు కంటెంట్ కావాలి. అది ఏ రకంగా ఫిల్ అవుతుంది? అన్నదానిపై చర్చ సాగుతోంది.
షూటింగ్ లు ముగించుకున్న సినిమాలు... థియేటర్ రిలీజ్ కు రెడీ అవుతున్న చిత్రాలు.. ఆల్రేడీ రిలీజులకి రెడీ అయిపోయి కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలు .. ఈ మూడు కేటగిరీ సినిమాల్లో ఎవరు ఎప్పుడు సినిమాలు విడుదల చేయాలి? అనే విషయం పై మల్లగుల్లాలు పడుతున్నారు.
రిలీజ్ బరిలో స్టార్ల సినిమాలు ఉన్నాయి. చిన్న హీరోలు నటించినవి రిలీజ్ లకు రెడీగా ఉన్నాయి. వీటన్నిటినీ ఒకటొకటిగా రిలీజ్ చేస్తారు కానీ జనం థియేటర్లకు వస్తారా..? థియేటర్లకి ఎవరూ రాకపోతే ఎలా? అని భయపడుతున్నారు కొందరు. ఇక మీడియం రేంజీ వాళ్లు టిక్కెట్లు రేట్లు తగ్గించేశారని చింతిస్తున్నారు. మొత్తానికి తెలుగు చిత్ర పరిశ్రమ అష్టకష్టాలు పడుతుంది. అయితే ఏపీలో టిక్కెట్టు ధరలపై జీవోని సవరిస్తే కొంతవరకూ పరిశ్రమకు ధైర్యం వస్తుంది. తెలంగాణ ఎగ్జిబిటర్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. మార్గం సుగమం చేయాల్సినది ప్రభుత్వాలే. కరెంటు బిల్లుల మాఫీ సహా జీఎస్టీ తగ్గింపు ఇతర డిమాండ్లను పరిశీలించి ఎగ్జిబిషన్ రంగాన్ని ఆదుకోవాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ వేవ్ భయాలు లేకుండా జనాల్ని థియేటర్లకు రప్పించేందుకు ఒక బృహత్తర ప్రణాళికను ప్రభుత్వాలతో కలిసి ఎగ్జిబిటర్లు ప్లాన్ చేయాల్సి ఉంటుంది.