Begin typing your search above and press return to search.
ఎలిజిబుల్ బ్యాచిలర్ కి రిలీజ్ డైలమా!
By: Tupaki Desk | 29 March 2021 10:00 PM ISTఅక్కినేని అఖిల్ కెరీర్ ఫైట్ తెలిసిందే. నటించిన తొలి మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ క్రమంలోనే ప్రస్తుతం నాలుగో సినిమాతో ఎట్టి పరిస్థితిలో బ్లాక్ బస్టర్ సాధించాలన్న పంతంతో కనిపిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ - బన్ని వాసు నిర్ధేశనంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో పూజా హెగ్డే అతడి సరసన కథానాయికగా నటించింది. ఇక ఆ ఇద్దరి మధ్యా లవ్.. రొమాన్స్ పీక్స్ లో ఉండనుందని ఇంతకుముందే రిలీజైన పోస్టర్లు ప్రమోషన్ మెటీరియల్ రివీల్ చేసింది. తాజా సమాచారం మేరకు ఆ ఇద్దరి నడుమ రొమాంటిక్ సీన్స్ ఓ రేంజులో వర్కవుటయ్యాయని తెలుస్తోంది. పూజాతో అఖిల్ కెమిస్ట్రీ బాగానే వర్కవుటైంది. ఈసారి లక్ కలిసొస్తే అతడు హిట్టు కొట్టేస్తాడు అంటూ ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఫస్ట్ కాపీ సహా సర్వం సిద్ధం. కానీ రిలీజ్ తేదీ విషయంలోనే డైలమా కనిపిస్తోంది. జూన్ 19 రిలీజ్ అంటూ ఇంతకుముందు వెల్లడించినా అప్పటికి కాంపిటీషన్ ఉంది. దీంతో సోలో రిలీజ్ కోసం తేదీని అటూ ఇటూ మార్చే ఆలోచనలో చిత్రబృందం ఉందిట. అయితే దీనిపై జీఏ 2 బృందం నుంచి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది.