Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ మొద‌టికి వచ్చేసిన సినిమా విడుద‌ల తేదీలు..!

By:  Tupaki Desk   |   3 Feb 2022 9:32 AM GMT
మ‌ళ్లీ మొద‌టికి వచ్చేసిన సినిమా విడుద‌ల తేదీలు..!
X
టాలీవుడ్ లో డేటా రెండు రోజులుగా విడుదల తేదీల జాతర నడుస్తోంది. గతంలో వాయిదా పడిన పెద్ద సినిమాలు.. ఇప్పుడిప్పుడే రెడీ అయిన చిత్రాలు అన్నీ రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉంటుందో అని ఒకేసారి రెండు డేట్స్ మీద ఖర్చీఫ్స్ వస్తున్నారు. రేపు ఫిబ్రవరి 4 మొదలుకొని మే 20వ తేదీ వరకు విడుదల తేదీలు ప్రకటించబడ్డాయి. ఇందులో పలు పాన్ ఇండియా సినిమాలతో పలు క్రీజీ మీడియం రేంజ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే రిలీజ్ డేట్స్ విషయంలో పరిస్థితి మళ్లీ మొదటికి రాబోతోందనే కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

కరోనా నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నిబంధనలను మరో రెండు వారాల పాటు పొడిగించారు. దీని వల్ల ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ మరియు నైట్ కర్ఫ్యూ ఫిబ్రవరి 14 వరకు కొనసాగనున్నాయి. ఇది టాలీవుడ్ కు ఇబ్బందికరమైన అంశమే. ఆక్యుపెన్సీ వల్ల పెద్దగా సమస్య లేకపోయినా.. రాత్రిపూట ఆంక్షల కారణంగా సెకెండ్ షో వేసుకోవడానికి అవకాశం లేకపోవడం సమస్యే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రా రీజ‌న్ లో వచ్చే వారం రాబోయే సినిమాలను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు వెనుకంజ వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఫిబ్రవరి 11న అనేక సినిమాల విడుదలలు ప్లాన్ చేసారు. అందులో మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఖిలాడీ' సినిమా కూడా ఉంది. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. ఆంధ్ర ఏరియా సుమారు 10 కోట్ల రేషియోలో విక్రయించారని టాక్. ఇప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీ - రోజుకు మూడు షోలే అంటే బయ్యర్లకు ఇబ్బందులు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఖిలాడి' చిత్రాన్ని మరో వారం పోస్ట్ పోన్ చేసి.. ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్నడుస్తోంది.

అలానే సితార బ్యానర్ లో రూపొందిన 'డీజే టిల్లు' చిత్రాన్ని కుదిరితే ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ నిన్న విడుదలైన ట్రైలర్ లో డేట్ మెన్షన్ చేయలేదు. ఏపీలో సిచ్యుయేషన్ ని బట్టి రిలీజ్ గురించి నిర్ణయం తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారని అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఆంధ్రలో సెకెండ్ షో లు వేయడం లేదు. షో టైమింగ్స్ మార్చుకుంటే నాలుగు షోలు వేసుకునే అవకాశం ఉంది. కాకపోతే అంత పొద్దున్నే ఆంధ్రాలో సినిమాలు చూడటానికి జనాలు వస్తారా లేదా అనే సందేహాలు ఉన్నాయి.

వీటితో పాటుగా ఏపీలో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయి దీనిపై చర్చించారు. త్వరలోనే ఇండస్ట్రీకి మంచిరోజులొస్తాయని చిరు పేర్కొన్నారు. ఆ ఆశాభావంతోనే అందరూ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకునున్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. టికెట్ రేట్లపై ఏర్పాటైన కమిటీ నివేదిక ఎక్కడిదాకా వచ్చిందనే దానిపై స్పష్టత లేదు. ఏపీలో టికెట్ ధరల నిర్ణయం మీదనే 'భీమ్లా నాయక్' విడుదల ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం తప్పదని టాక్ వినిపిస్తోంది.