Begin typing your search above and press return to search.

సమంతా ఓ బేబీ.. ఆ రోజే ఫిక్స్

By:  Tupaki Desk   |   1 Jun 2019 9:47 AM GMT
సమంతా ఓ బేబీ.. ఆ రోజే ఫిక్స్
X
టాలీవుడ్ లో ప్రస్తుతం యమా జోరు మీద ఉన్న స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని. టాలీవుడ్ ఒక్కటేంటి.. సౌత్ లోనే టాప్ లీగ్ స్టార్ హీరోయిన్లలో సమంతా ఒకరు. రీసెంట్ గా తన ప్రియమైన భర్త నాగచైతన్యతో కలిసి 'మజిలీ' లో బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ నుండి తేరుకునేలోపే సమంతా కొత్త సినిమా 'ఓ బేబీ' హంగామా మొదలైయింది.

నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓ బేబీ' టీజర్ ను కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సమంతా మరోసారి తన అల్లరితో సిల్వర్ స్క్రీన్ ను దడదడలాడిస్తుందనే విషయం ఆడియన్స్ కు అర్థం అయిపోయింది. మరోవైపు ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో పాటుగా ఫిలిం మేకర్లు 'ఓ బేబీ' రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. జూలై 5 వ తారీఖున 'ఓ బేబీ' ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారని తెలిపారు.

ఈ కామెడీ ఎంటర్టైనర్ లో నాగ శౌర్య.. లక్ష్మి.. రావు రమేష్.. రాజేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్.. గురు ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ సౌత్ కొరియన్ ఫిలిం 'మిస్ గ్రానీ' కి రీమేక్ గా తెరకెక్కుతోంది.