Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. మేన‌ల్లుళ్ల స్ట్రోక్స్ ఏంటో కానీ..?!

By:  Tupaki Desk   |   6 Jan 2022 11:00 AM IST
#గుస‌గుస‌.. మేన‌ల్లుళ్ల స్ట్రోక్స్ ఏంటో కానీ..?!
X
కుమారులు కుమార్తెలు న‌ట‌వార‌సులుగా రాణించ‌డం చాలా కామన్. కానీ ఇటీవ‌ల అందుకు భిన్నంగా మేన‌ల్లుళ్లు.. అల్లుళ్లు ఇత‌ర బంధువులు కూడా న‌ట‌వార‌సులుగా లాంచ్ అవుతున్నారు. ఇండ‌స్ట్రీలో ఖ‌ర్చీఫ్ వేసేందుకు ఏమాత్రం వెన‌కాడ‌డం లేదు. దానికోసం హార్డ్ వ‌ర్క్ చేస్తున్న వాళ్లు ఉన్నారు. ఈ కేట‌గిరిలో టాలీవుడ్ లో చాలా మంది న‌ట‌వార‌సులున్నారు.

తెలుగు ఇండ‌స్ట్రీకి సినిమాల్లోనే కాదు ఎక్క‌డైనా వార‌సులు రావ‌డం అన్న‌ది కామ‌న్.. అయితే తెలుగులో ఇప్పుడు అల్లుళ్లు ఎంట్రీలు ఎక్కువైపోయాయి. అలా ఎంట్రీ ఇచ్చిన వారు సూప‌ర్ స్టార్లు అయిన వాళ్లున్నారు. అది వేరే విష‌యం కానీ అదంతా 20 ఏళ్ల క్రింద‌టి మాట‌.

ఇప్పుడు మాత్రం ప‌రిస్థితులు వేరేగా ఉన్నాయి. అల్లుళ్లు మేన‌ల్లుళ్లు ఎంట్రీ ఇస్తున్నా కానీ స్వ‌యంకృషితో ఎద‌గాల‌ని క‌సిగా ప‌ని చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఫ‌లానా హీరోకి న‌ట‌వార‌సుడు అనిపించుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం నిజంగా ప్ర‌శంసించ‌ద‌గిన క్వాలిటీ.

సూప‌ర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పుష్క‌ర కాలం అయింది. కానీ ఇప్పుడిప్పుడే కెరీర్ నిల‌దొక్కుకుంటున్నాడు. హార్డ్ వ‌ర్క్ లో సుధీర్ బాబు గురించి చెప్పాల్సిన దేమీ లేదు. సూప‌ర్ స్టార్ల అండ‌దండ‌లు త‌న‌కు ఉన్నా కానీ త‌న‌దైన హార్డ్ వ‌ర్క్ ప్ర‌తిభ‌తో ఎదిగేందుకు శ్ర‌మిస్తున్నాడు. బాడీ బిల్డింగ్- డాన్స్ అంటూ ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలిలో లేని ఇత‌ర క్వాలిటీస్ పై కాన్స‌న్ ట్రేట్ చేస్తూ త‌న‌కో ఇమేజ్ తెచ్చుకున్నాడు.

మెగా కాంపౌండ్ లో మేన‌ల్లుళ్లు సాయి తేజ్- వైష్ణ‌వ్ తేజ్ స్వ‌యంకృషితో ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ మావ‌య్య స్ఫూర్తితో ఈ రంగంలోకి వ‌చ్చినా కానీ త‌న‌దైన హార్డ్ వ‌ర్క్ ట్యాలెంట్ తో ఎదిగాడు. వైష్ణ‌వ్ తేజ్ కి ఆరంభ‌మే ఉప్పెన రూపంలో అదృష్టం క‌లిసొచ్చింది. ఇక‌పై స్టార్ డ‌మ్ అందుకునేందుకు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. దానికోసం బాగా శ్ర‌మించాలి.

ఇక మెగాస్టార్ అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ప‌రిస్థితి వేరేగా ఉంది. మెగా బ్రాండ్ ని ఉప‌యోగించుకుని సినీ ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు వారి స‌పోర్ట్ లేకుండా ఎదాగాల‌ని శ్ర‌మిస్తున్నాడు. కానీ ఇక్క‌డ ఏదీ అంత సులువేమీ కాదు. న‌టుడిగా విల‌క్ష‌ణ‌త‌ను ఆపాదించుకుని యూనిక్ నెస్ తో బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడితేనే నిల‌దొక్కుకోవ‌డం కుదురుతుంది. ఇంకా త‌న‌కు ఆ గుర్తింపు రావాలి.

మ‌హేశ్ మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ `హీరో` సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. డెబ్యూ క‌నుక ఫిల్మీ స‌ర్కిల్స్ కే ఇంకా అత‌డి గురించి పూర్తిగా తెలీదు. మ‌హేశ్ మేన‌ల్లుడుగా ఇప్ప‌టికి సుప‌రిచితం. ఏదైమైనా వీళ్ల‌లో కొంద‌రు ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బ‌రిలో స‌త్తా చాటేందుకు వ‌స్తున్నారు. కొత్త అల్లుళ్లు వారి అత్త‌గారింటికి వెళ్తారో లేదో తెలీదు కానీ ఇండ‌స్ట్రీలో ఉన్న అల్లుళ్లు మాత్రం థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. గ‌ల్లా అశోక్ న‌టించిన హీరో.. క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన సూప‌ర్ మ‌చ్చి సంక్రాంతి రేసులో పోటీప‌డుతున్నాయి.

ఇద్ద‌రు అల్లుళ్ల స‌త్తా ఎంతో కాస్త ఆగితే కానీ తేల‌దు. ఈ సంక్రాంతికి కొత్త అల్లుళ్ల‌తో పాటు.. దిల్ రాజు సోద‌రుడు శిరీష్ కుమారుడు ఆశిష్ కూడా హీరోగా స‌త్తా చాటేందుకు బ‌రిలో దిగుతున్న సంగ‌తి తెలిసిన‌దే. అత‌డు న‌టించిన రౌడీ బోయ్స్ ట్రైల‌ర్ విజువ‌ల్స్ ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమాపైనా యూత్ లో అంచ‌నాలున్నాయి. సుధీర్ బాబు.. సాయి తేజ్ లాంటి హీరోల సినిమాలేవీ సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కి రావ‌డం లేద‌న్న సంగ‌తి విధిత‌మే.