Begin typing your search above and press return to search.

ఒక్కటొక్కటంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆ భామను వందసార్లు రిజెక్టు చేశారట

By:  Tupaki Desk   |   8 July 2021 4:45 AM GMT
ఒక్కటొక్కటంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆ భామను వందసార్లు రిజెక్టు చేశారట
X
గ్లామర్ ప్రపంచంలో తళుక్కున మెరవాలని.. స్టార్ అయిపోవాలని ఆశ పడేవారు చాలామందే ఉంటారు. ఊరించే ఈ రంగంలో రాణించటానికి టాలెంట్ ఉంటే సరిపోదు. అంతకు మించి ఛాన్సులు చాలా అవసరం. ఎంత టాలెంట్ ఉన్నా.. అవకాశాలు రాకుంటే ఏం చేయగలం. ఇక.. కొత్త వారికి ఉండే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. తాజాగా ఒక ప్రైవేటు పాటతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. తన హుషారైన అందాలతో కవ్విస్తోంది దివి వైద్య. ఈ హైదరాబాద్ పోరి తాజాగా చేసిన ‘చిలక ముక్కుదానా’ పాటతో కవ్వించేస్తోంది.

శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పుడు దమ్మురేపుతోంది. ఆమెకు కొత్త గుర్తింపును తీసుకొస్తోంది. నిజానికి బిగ్ బాస్ 4 ముందు వరకు దివి వైద్య గురించి తెలిసినోళ్లు కొంతమందే. ఎప్పుడైతే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి ఆమె గురించి ప్రస్తావించటం.. ఆమెను పొగిడేయటంతో ఒక్కసారిగా ఆమె హాట్ టాపిక్ గా మారారు. బిగ్ బాస్ తో గుర్తింపు.. చిరు ప్రశంసలు తోడు కావటంతో అందరి చూపు ఆమె మీద పడింది. దీనికి తోడు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ (టీవీ) 2020 టైటిల్ ను సొంతం చేసుకున్న ఆమె ఇప్పుడు అందరి నోట్లో నానుతోంది.

తనకు వచ్చిన పేరును కాపాడుకుంటూ.. తనలోని టాలెంట్ ను ప్రైవేటు సాంగ్ తో ప్రదర్శించటమే కాదు.. ఇంత హుషారైన అమ్మాయికి అవకాశాలు ఇవ్వాలన్న పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో సక్సెస్ అయ్యింది.

తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. తనకు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ టైటిల్ సొంతం చేసుకున్నట్లుగా ఫోన్ రావటంతో ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా చెబుతోంది దివి. ఈ టైటిల్ ను సొంతం చేసుకోవటానికి తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని చెప్పింది.

తనకు సినిమాల మీద ఉన్న ఆసక్తితో చాలా మూవీ ఆడిషన్స్ కు వెళ్లానని.. కానీ.. తనను వంద సార్లకు పైనే రిజెక్టు చేసిన షాకింగ్ నిజాన్ని ఓపెన్ గా చెప్పేసింది. అయితే.. తనను తిరస్కరించిన ప్రతిసారీ మరింత బలంగా తయారయ్యేదానినని.. త్వరలో తాను చిరు మూవీలో చేస్తున్నట్లు చెప్పింది. పెద్ద సినిమాల్లో ఆఫర్ రావటం సంతోషంగా ఉందన్న ఈ భామ.. ఇలాంటి రోజు కోసమే తాను చాలాకాలంగా వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది. హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని అందచందాలతో పాటు.. కవ్వించే కళ్లు.. మత్కెక్కించే ఆకర్షణ మాత్రమే కాదు.. చాలామందిలో కనిపించని హుషారు దివీ సొంతం. ఆమె అనుకున్నట్లే మరెన్ని విజయాల్ని సాధిస్తుందో చూడాలి.