Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో రెగ్యుల‌ర్ ఫిట్నెస్ ఫ్రీక్స్

By:  Tupaki Desk   |   11 Oct 2020 4:20 PM IST
టాలీవుడ్ లో రెగ్యుల‌ర్ ఫిట్నెస్ ఫ్రీక్స్
X
టాలీవుడ్ లో ఫిట్నెస్ ఫ్రీక్స్ కి కొద‌వేమీ లేదు. జూబ్లీ హిల్స్.. బంజారాహిల్స్ లో సెల‌బ్రిటీ జిమ్ ల‌న్నీ నిరంత‌రం కిట‌కిట‌లాడుతూనే ఉంటాయి. మ‌రోవైపు సిటీ న‌డిబొడ్డున ఫిలింన‌గ‌ర్ జూబ్లీహిల్స్ ఏరియాలోని కేబీఆర్ పార్క్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. అయితే పార్కుల‌న్నీ లాక్ డౌన్ వ‌ల్ల మూతప‌డిన సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే జిమ్ లు తెర‌వ‌డంతో సెల‌బ్స్ కి కొంత వెసులుబాటు దొరికింది. ఇప్పుడు ఎవ‌రికి వారు జిమ్ కి వెళ్లి వ‌స్తున్నారు. ఇదిగో అలా జిమ్ కి వెళుతూ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు ఆ న‌లుగురు. లావ‌ణ్య త్రిపాఠి- నిహారిక‌- న‌వ‌దీప్ త‌దిత‌రులు జిమ్ కి వెళుతూ ఇలా కెమెరా కంటికి చిక్కారు.

నిహారిక ఈ డిసెంబ‌ర్ లో ఐజీ కుమారుడు సాఫ్ట్ వేర్ చైత‌న్య‌ను పెళ్లాడుతోంది. ప‌ర్ఫెక్ట్ ఫిట్ గా క‌నిపించేందుకు నిరంత‌రం జిమ్ చేస్తోంది. ఇక లావ‌ణ్య ఇటీవ‌ల జిమ్ నుంచి ర‌క‌ర‌కాల ఫోటోల్ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. న‌వదీప్ టీవీ షోలు స‌హా ర‌క‌ర‌కాల వ్యాప‌కాల‌తో బిజీగా ఉన్నాడు. ఫిట్నెస్ విష‌యాన్ని మాత్రం అశ్ర‌ద్ధ చేయ‌డం లేదు. ఇక వీళ్ల‌లానే ఇత‌ర స్టార్లు అంతా జిమ్ ల చుట్టూ తిరిగేస్తూ క‌స‌ర‌త్తుల‌లో బిజీ అయితున్నారు. ఇక సామ్ - ఉపాస‌న లాంటి సెల‌బ్రిటీలు ఫిట్నెస్ పాఠాలు చెబుతూ నెటిజ‌నుల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.