Begin typing your search above and press return to search.

గ్లామర్ హీరోయిన్నే అని మొత్తుకుంటోంది

By:  Tupaki Desk   |   21 Sep 2015 7:30 PM GMT
గ్లామర్ హీరోయిన్నే అని మొత్తుకుంటోంది
X
ఇండస్ట్రీలో మంచి నటి అని పేరు తెచ్చుకోవడానికి హీరోయిన్ లు పెద్దగా ఇష్టపడరు. అలా పేరు తెచ్చుకున్నవాళ్లవెరికీ సరైన అవకాశాలు రావు. మన స్టార్ హీరోల సినిమాల్లో ఎలాగూ నటనకు ప్రాధాన్యమున్న హీరోయిన్ల పాత్రలుండవు కాబట్టి.. ఆ హీరోయిన్ కు పెద్ద అవకాశాలేవీ రావు. అందుకే గ్లామర్ హీరోయిన్ అన్న పేరు తెచ్చుకోవడానికే హీరోయిన్ లు తహతహలాడిపోతుంటారు. ఇప్పుడు రెజీనా ప్రయత్నం కూడా అదే. ఈ తమిళ హీరోయిన్ తెలుగులో కెరీర్ ఆరంభం నుంచి మంచి మంచి పాత్రలు చేస్తోంది. అందరూ ఆమె నటనను పొగిడేవాళ్లే కానీ.. పెద్ద సినిమాల్లో అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. గ్లామర్ హీరోయిన్ అనిపించుకోకపోవడమే దీనికి కారణమని భావిస్తోంది.

అందుకే ‘పవర్’ సినిమాలో కొంచెం సెక్సీగా కనిపించి.. తనపై ఉన్న ముద్రను కొంచెం చెరిపేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా పూర్తిగా ముద్రను తొలగించేస్తుందనే ఆశతో ఉంది అమ్మడు. ఓ ఇంటర్వ్యూ లో ఈ సంగతే చెప్పింది రెజీనా. ‘‘సుబ్రమణ్యం ఫర్ సేల్ లో నటడించడంతో పాటు అందంగా కనిపించే అవకాశమిచ్చాడు హరీష్ శంకర్. నేను ఇప్పటిదాకా ఏ సినిమాలో కనిపించనంత అందంగా కనిపిస్తానిందులో. ఇది హరీష్ గారి మ్యాజిక్కే. నన్నలా చూపించడంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రెజీనా గ్లామర్ హీరోయిన్ కాదు అనే ముద్ర ఈ సినిమాతో చెరగిపోతుంది’’ అని రెజీనా చెప్పింది. యాష్ కరేగీ పాట చూస్తేనే రెజీనా గ్లామర్ డోస్ బాగా పెంచిందన్న సంగతి అర్థమవుతోంది. మరి తెరమీద ఆమె ఎలా రెచ్చిపోయిందో చూద్దాం.