Begin typing your search above and press return to search.

ఎవరుకు ఫుల్లు గ్లామర్ టచ్ ఇచ్చిందట!

By:  Tupaki Desk   |   18 July 2019 9:05 PM IST
ఎవరుకు ఫుల్లు గ్లామర్ టచ్ ఇచ్చిందట!
X
రెజినా కసాండ్రా తెలుగులో పాపులర్ హీరోయినే కానీ ఈమధ్య జోరు తగ్గింది. 'అ!' సినిమాలో నటించిన తర్వాత రెజీనా చాలా గ్యాప్ తీసుకుని కొద్ది రోజుల క్రితం '7' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఆ సినిమా ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. తమిళంలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం అడివి శేష్ 'ఎవరు' మాత్రమే తన చేతిలో ఉన్న సినిమా.

అడివి శేష్ హీరోగా వెంకట్ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ 'ఎవరు'. 'గూఢచారి' లాంటి స్పై థ్రిల్లర్ తో ఆడియన్స్ ను మెప్పించిన అడివి శేష్ నెక్స్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ఎక్కువే ఉంది. ఈ సినిమాపై రెజీనా కూడా భారీ నమ్మకమే పెట్టుకుందట. అందుకే ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించిందనే టాక్ వినిపిస్తోంది. విశ్వరూపం అనగానే నటనలో పూర్తిగా చంద్రముఖిగా మారిన రెజీనా అనుకోకండి. గ్లామర్ విషయంలో పూర్తిగా చంద్రముఖి అవతారంలోకి మారిపోయిందట. రెజీనా ఘాటు అందాలు ఈ సినిమాకు ఒక హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి ఈ సినిమాతో తెలుగులో క్రేజీ ఆఫర్లు రావాలనే ఉద్దేశంతో రెజినా ఇలా డిసైడ్ అయిందేమో.

'ఎవరు' లో నవీన్ చంద్ర.. మురళి శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు. ఈ సినిమాను మొదట ఆగష్టు 23 న రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ తాజాగా రిలీజ్ డేట్ ను ఆగష్టు 15 కు మార్చడం జరిగింది.