Begin typing your search above and press return to search.
రేసులో గెలిచిన రెజినా.. ఫస్ట్ టైం అయినా ఫస్ట్ ప్రైజ్ కొట్టేసిందిగా!
By: Tupaki Desk | 30 March 2021 3:18 PM ISTఇండస్ట్రీలో హీరోయిన్స్ అప్పుడప్పుడు సినిమాలను మాత్రమే కాకుండా వారి ఇష్టాలు, అభిరుచుల వైపు కూడా ఓ లుక్కేస్తుంటారు. అంటే ప్రత్యేకంగా ఇంటరెస్ట్ ఉన్నవాటికోసం టైం కేటాయించలేరు. కానీ సమయం సందర్బం కుదిరితే మాత్రం ఖచ్చితంగా తమ ఇతర టాలెంట్స్ ప్రూవ్ చేసుకుంటారు. తాజాగా అదేకోవలో చేరింది హీరోయిన్ రెజినా. ఈ అమ్మడు ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితం. ఎల్లప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే రెజినా తాజాగా ఓ వాటర్ స్పోర్ట్స్ గేమ్ లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుందట. ఏంటి రెజినా స్పోర్ట్స్ లో ప్రైజ్ గెలిచిందా..! అని ఆశ్చర్యంగా అనిపించినా నమ్మకతప్పదు. ఎందుకంటే రెజినా ఫస్ట్ టైం అలాంటి స్పోర్ట్స్ లో పాల్గొని ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందంటే మాములు విషయం కాదు. ఆమె ఫ్యాన్స్ ఎవరైనా సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే.
మొన్నటి ఆదివారం రోజున చెన్నైలో రెజినా.. స్టాండప్ పడిల్ రేసులో పాల్గొందట. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. మొదటిసారి పాల్గొన్నప్పుడే ఫస్ట్ స్థానంలో నిలవడం. తాజాగా అమ్మడు ఆ రేసు గురించి మాట్లాడుతూ.. నిజానికి ఆరోజు నేను చెన్నైలో ఉండాల్సింది కాదు. ఓ సినిమా షూటింగ్ వాయిదా పడటం వలన ఇంటికి వచ్చాను. అయితే ఏదో సరదాగా నా ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నాను. నిజానికి రిలే రేసులో పాల్గొనాలని అనుకున్నాను. కానీ నా ఫ్రెండ్స్ సోలో రేసులో పాల్గొనాలని సూచిస్తే అందులోనే పోటీచేసాను. మొత్తానికి రేసులో విన్ అయ్యాను. చాలా హ్యాపీ అని చెప్పుకొచ్చింది. ఇటీవలే రెజినా సైబర్ థ్రిల్లర్ చక్ర సినిమాలో కనిపించింది. త్వరలోనే ఆచార్య సినిమాలో కనిపించనుంది. అలాగే పలు తమిళ ప్రాజెక్ట్ లతో రెజినా బిజీగా ఉంది.