Begin typing your search above and press return to search.

ప్రయోగం సూపరే.. కానీ పేరే లేదే

By:  Tupaki Desk   |   2 Jan 2019 10:27 AM IST
ప్రయోగం సూపరే.. కానీ పేరే లేదే
X
రెజినా తెలుగులో చాలా సినిమాల్లోనే నటించిన స్టార్ హీరోయిన్ లీగ్ లోకి చేరలేకపోయింది. ఈమధ్య దాదాపుగా తమిళ సినిమాలే చేస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో ఆఫర్ సంపాదించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' సినిమాలో రెజీనా ఒక కీలకపాత్ర పోషిస్తోంది.

ఈ సినిమా బాలీవుడ్ లో రెజీనా కు డెబ్యూ ఫిలిం. లెస్బియన్ ప్రేమ ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలో సోనమ్ కపూర్ కు లవర్ గా రెజీనా నటిస్తోంది. మొదటి సినిమా ఇంత ప్రయోగం చేస్తోంది గానీ ట్రైలర్లో గానీ ఇతర ప్రమోషనల్ పోస్టర్లలో గానీ రెజీనా కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒకవేళ ఫిలిం మేకర్స్ కావాలనే ఇలా సర్ ప్రైజ్ ఫ్యాక్టర్ లా రెజినా పాత్రను తక్కువ ఫోకస్ చేసి ఉండొచ్చుగానీ అసలు ఎక్కడా టైటిల్ క్రెడిట్స్ లో రెజీనా పేరు కనబడకపోవడం మాత్రం విచిత్రమే.

ట్రైలర్ చివర్లో చూపించే టైటిల్స్ లో కానీ యూట్యూబ్ లో వీడియో కింద ఇచ్చే ఇన్ఫర్మేషన్ లోగానీ రెజీనా పేరు లేదు. లెస్బియన్ లవ్ స్టోరీతో తెరకెక్కే సినిమాలో లీడ్ పెయిర్ లో ఒక పాత్ర పోషించే నటి పేరు కూడా మెన్షన్ చేయకపోవడంతో ఫిలిం మేకర్స్ పై కొందరు నెటిజనులు విమర్శలు గుప్పిస్తున్నారు.