Begin typing your search above and press return to search.

రెజీనా బోల్డ్ అవ‌తార్...డిజిట్ వ‌రల్డ్‌ లో..

By:  Tupaki Desk   |   26 Sept 2021 10:01 AM IST
రెజీనా బోల్డ్ అవ‌తార్...డిజిట్ వ‌రల్డ్‌ లో..
X
క్రేజీ హీరోయిన్ రెజీనా బోల్డ్ అవ‌తార్‌ లో క‌నిపించ‌బోతోంది. వివ‌రాల్లోకి వెళితే.. ఈ ఏడాది త‌మిళ చిత్రం `త‌లైవి`లో స‌రోజా దేవిగా న‌టించి ఆక‌ట్టుకున్న రెజీనా .. మెగాస్టార్ `ఆచార్య‌`లోని స్పెష‌ల్ సాంగ్ ‌లో మెరిసింది. త్వ‌ర‌లో ఈ మూవీ థియేట‌ర్లో సంద‌డి చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీతో పాటు తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్న ఈ అందాల సోయ‌గం త్వ‌ర‌లో డిజిట్ వ‌రల్డ్‌ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

ఇటీవ‌ల స్టార్ హీరోయిన్ సమంత `ఫ్యామిలీమెన్ 2`తో డిజిట‌ల్ దునియాలోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిపిందే. రాజ్ లండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించారు. నేష‌న‌ల్ వైడ్‌ గా సంచ‌ల‌నం సృష్టించిన ఈ వెబ్ క్రైమ్ డ్రామాతో స‌మంత‌కు నేష‌న‌ల్ లెవెల్లో మంచి గుర్తింపుతో పాటు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇప్పుడు ఇదే ద‌ర్శ‌క ద్వ‌యం మ‌రో సెన్సేష‌న‌ల్ వెబ్ డ్రామాల‌కు రెడీ అయిపోతున్నారు. ఇప్ప‌టికే ప‌లు వెబ్ సిరీస్ ‌ల‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ ల‌ని ఫైన‌ల్ చేసిన రాజ్ అండ్ డీకే త్వ‌ర‌లో రెజీనాతో మ‌రో సెన్సేష‌న‌ల్ వెబ్ డ్రామాకు రెడీ అవుతున్నార‌ట‌.

ఇందులో రెజీనా చాలా బోల్డ్‌ గా క‌నిపించ‌బోతోంద‌ని చెబుతున్నారు. ఈ వెబ్ సిరీస్ మ‌హిళా ప్ర‌ధానంగా సాగుతుంద‌ని చెబుతున్నారు. స్క్రిప్ట్ చెప్ప‌గానే రెజీనా వెంట‌నే ఈ సిరీస్‌లో బోల్డ్‌ గా నటించ‌డానికి అంగీక‌రించిన‌ట్టుగా తెలిసింది. తెలుగు.., త‌మిళ భాష‌ల్లో త‌న‌ క్రేజ్ త‌గ్గడంతో రెజీనా వెబ్ ‌సిరీస్ లో న‌టించ‌డానికి అంగీక‌రించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.