Begin typing your search above and press return to search.

రెజీనా ఆరబోత ఏమవుతుందో మరి

By:  Tupaki Desk   |   7 April 2018 12:33 PM IST
రెజీనా ఆరబోత ఏమవుతుందో మరి
X
టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న నటీమణులు చాలానే ఉన్నారు. హీరోయిన్ అంటే ఒక్క నటనలోనే కాకుండా గ్లామర్ పాత్రలలో కూడా సినిమాకు తగ్గట్టు చేస్తేనే బిజీ అవుతారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ దాదాపు ఒకే ఇయర్ నాలుగైదు సినిమాలను చేస్తున్నారు. అందులో గ్లామర్ బ్యూటీలే ఎక్కువగా ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు హాట్ గా కనిపించి కుర్రకారును ఆకట్టుకుంటున్నారు.

అయితే కొందరు ఆ రూట్ లో ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వడం లేదు. ముఖ్యంగా రెజీనా కసాండ్రా పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలిసిందే. అమ్మడి అందాల ఆరబోత కొత్తేమి కాదు. గత ఏడాది వచ్చిన నక్షత్రం సినిమాలో డోస్ చాలా పెంచేసింది. కానీ టాలీవుడ్ లో అస్సలు వర్కౌట్ కాలేదు. అయితే తెలుగు ఆడియెన్స్ కి నచ్చదు అనుకుందో ఏమో గాని కోలీవుడ్ లో ఆ ఫార్ములాను ఉపయోగిస్తోంది. అక్కడ తన హాట్ క్లివేజ్ అందాలతో ఆదరగొడుతోంది.

గౌతమ్ కార్తిక్ తో మిస్టర్ చంద్రమౌళి అనే ఒక సినిమాలో నటిస్తోన్న రెజీనా హద్దులకు మించి గ్లామర్ ను ప్రజెంట్ చేస్తోంది. ఎక్కడా కూడా తగ్గకుండా తనకు తెలిసిన స్టైల్ లో స్టిల్స్ ఇస్తోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మిడియలో వైరల్ అవుతున్నాయి. మరి టాలీవుడ్ లో సక్సెస్ కానీ అందాల షో కోలీవుడ్ లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి