Begin typing your search above and press return to search.

రెజినా-దశ మారేనా

By:  Tupaki Desk   |   15 Jan 2018 4:57 AM GMT
రెజినా-దశ మారేనా
X
సినిమాల్లో అవకాశాలు రావడం ఎంత ముఖ్యమో టైం కలిసి రావడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే ఒక్క సంవత్సరంలోనే మొత్తం తారుమారు అయిపోతుంది. రెజినా కసండ్రా పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. లాస్ట్ ఇయర్ తను నటించిన నక్షత్రం, బాలకృష్ణుడు రెండూ సూపర్ డిజాస్టర్స్ నిలవడం తనను బాగా నిరాశ పరిచింది. ఇవి విడుదలకు ముందు మంచి హైప్ ఉన్న మూవీసే. కాని దారుణమైన కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. తమిళ్ లో చేసిన మానగరం అక్కడ బాగానే ఆడి తనకు పేరు తీసుకొస్తే అదే సినిమా డబ్బింగ్ వెర్షన్ తెలుగులో మాత్రం పల్టీ కొట్టింది. అందుకే 2017 తనకు ఏ మాత్రం అచ్చిరాలేదని ఓపెన్ గా చెప్పేసింది రెజినా. రెండేళ్ళ క్రితం వరస ఆఫర్స్ తో బిజీ గా ఉంటూ స్టార్ హీరోలతో నటించడం ఒక్కటే బాలన్స్ అనుకుంటున్న టైంలో వరస పరాజయాలు తనను ఆపేశాయి. ఇప్పుడు తను చేస్తున్న మూవీస్ మీద మాత్రం చాలా హోప్స్ తో ఉంది.

రెజినా నటిస్తున్న వాటిలో బాగా క్రేజ్ ఉన్న మూవీ నాని నిర్మిస్తున్న అ. ఇందులో తాను కాఫీ షాప్ లో పని చేసే బేరర్ పాత్రలో కనిపిస్తానని, మాదక ద్రవ్యాలకు అలావాటు పడిన అమ్మాయిగా కథలో చాలా కీలక మలుపులకు తానే కారణం అవుతానని చెబుతోంది. ఈ మధ్యే విడుదలైన టీజర్ లో రెజినా తన లుక్స్ తో షాక్ ఇచ్చింది. చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, ఇంతకు ముందు ఎన్నడు చూడని లుక్ తో ఆశ్చర్యపరిచేలా తన పాత్ర ఉంటుందని చెప్పిన రెజినా అ మూవీ తనకు బ్రేక్ ఇస్తుందని బలంగా నమ్ముతోంది.

అ మూవీ షూటింగ్ పూర్తీ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఒక కాఫీ షాప్ లో జరిగే సంఘటనలను నేపధ్యంగా కొత్త దర్శకుడు ప్రశాంత్ రూపొందిస్తున్న ఈ మూవీకి నాని, రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇప్పటికే టాక్ గా మారింది. తెలుగు సినిమాల్లో గతంలో చూడని ఓ సరికొత్త అనుభూతిని ఇస్తామని మేకర్స్ చెబుతున్న అ మూవీలో రెజినాతో పాటు కాజల్, నిత్య మీనన్ కూడా నటిస్తున్నారు.