Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రెజీన రాచి రంపాన‌

By:  Tupaki Desk   |   12 Jan 2020 1:33 PM IST
ఫోటో స్టోరి: రెజీన రాచి రంపాన‌
X
రెజీన క‌సాండ్ర‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. ఎస్.ఎం.ఎస్.. రొటీన్ ల‌వ్ స్టోరి అనే చిత్రాల‌తో తెలుగు లోగిళ్ల‌లో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయిన రెజీన చాలా త‌క్కువ స‌మ‌యంలోనే తెలుగు ఇండ‌స్ట్రీలో క్రేజీ నాయిక‌గా ఎదిగింది. ఇక్క‌డ స్టార్ హీరోలు ఛాన్సులివ్వ‌క‌పోయినా అప్ప‌టికే ఫామ్ లో ఉన్న ఒక బంచ్ యంగ్ హీరోలు కావాల్సిన‌న్ని అవ‌కాశాలిచ్చారు.

అయితే ఈ చెన్న‌య్ చంద్రం ఎక్క‌డ ప‌ప్పులో అడుగేసిందో కానీ.. స్టార్ హీరోలు మాత్రం అస్స‌లు ద‌రి చేర‌నివ్వ‌లేదు. రెజీనాని ద్వితీయ శ్రేణి నాయిక‌గానే స్థిర‌ప‌రిచేశారు. కార‌ణం ఏదైనా రెజీనా నెక్ట్స్ లెవ‌ల్ ని అందుకోలేక‌పోయింది. ఇక మ‌ధ్య‌లో డేటింగులు ప్రేమ వైఫ‌ల్యం వంటివి కొంత డిస్ట్ర‌బ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ భామ‌కు తెలుగులో ఏమంత అవ‌కాశాల్లేవ్. ఆ క్ర‌మంలోనే త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ప‌బ్బం గ‌డిపేస్తోంది. తెలుగులో అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే ఛాన్సులు వ‌స్తుండ‌డంతో ఇరుగు పొరుగు వైపు అడుగులు వేస్తోంది. ఈలోగానే ఇదిగో ఇలా అవార్డు ఫంక్ష‌న్ల‌లో సంద‌డి చేస్తూ రెజీనా అదిరిపోయే ఫోజులిచ్చింది. అలా థై స్లిట్ ఫ్రాకులో రెజీనా ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ల‌కు మ‌తి చెడ‌గొడుతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు.

ఇక రెజీన కెరీర్ సంగ‌తిని చూస్తే.. ఇప్ప‌టికిప్పుడు త‌మిళంలో ఐదు సినిమాలు చేస్తున్నా ఏదీ రిలీజ్ కి రాదు. అన్నీ ఇంకా నిర్మాణ ద‌శ‌లోనే ఉన్నాయి. పార్టీ జ‌మానా కాలంలో మొద‌లైన సినిమా. ఇప్ప‌టికీ రిలీజ్ కాలేదు. క‌ళ్ల‌పార్ట్-క‌స‌డ త‌ప‌ర‌- చ‌క్ర‌- ఏవీ 31 చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. కానీ వీటికి సంబంధించిన తాజా స‌మాచారం ఏదీ లేదు.