Begin typing your search above and press return to search.

ఆ పోస్టును డెలీట్ చేసేసిన రెజీనా!!

By:  Tupaki Desk   |   19 Oct 2016 4:52 PM IST
ఆ పోస్టును డెలీట్ చేసేసిన రెజీనా!!
X
డస్కీ హీరోయిన్ రెజీనా కసాండ్రా.. ఈ మధ్యనే తన ఫిలిం కెరియర్ పై ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. తెలుగులో పెద్ద అవకాశాలు రావట్లేదని.. అలాగే తమిళంలో అయితే తన వెంటపడుతున్నారని.. ఇక బాలీవుడ్ లో ఒక సినిమా ఛాన్సొచ్చింది కాబట్టి.. అక్కడ ఇరగదీస్తానని పేర్కొంది. ఇంతలోనే ఈరోజు మార్నింగ్ పెద్ద ట్విస్టే ఇచ్చింది.

అసలే ఈరోజు నార్త్ ఇండియా అంతటా కర్వచౌత్ అంటూ చాలా పవిత్రంగా భావించే రోజు. సరిగ్గా ఇదే రోజును రెజీనా తన సోషల్ నెట్వర్క్ పేజీలో ఒక పోస్టు చేసింది. ''సారీ. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నేను ఇతడిని పెళ్లిచేసుకున్నాను. అతనెవరో మీ అందరికీ చెప్పేయాలని ఉంది. కాని చెప్పలేను. త్వరలో మీకే తెలుస్తుంది'' అంటూ తన చేతిని ఒక అబ్బాయి చేతిలో ఉంచి.. ఆ చేతికి ఉన్న ఉంగరం చూపించింది. అయితే ఉంగరం పెట్టుకుంటే క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లయిపోయినట్లే. అమ్మడు ఆ పోస్టుకు పెట్టిన హ్యాష్‌ ట్యాగులను చూస్తే.. తన పెళ్ళి గురించే ప్రస్తావించిందని వేరే చెప్పక్కర్లేదు. #weddingbells #runawaybride #hitched #mrsrc #mymystryman అంటూ యాడ్ చేసింది రెజీనా. పెళ్లిబాజాలు మోగాయ్ అని చెబుతూ.. లేచిపోయి పెళ్ళి చేసుకున్నాం అని సెలవిచ్చిందనమాట.

ఆ మధ్యన అల్లు శిరీష్‌ కూడా ఇలాగే ఒక పోస్టు పెట్టి.. తెల్లారితే ''శ్రీరస్తు శుభమస్తు'' సినిమాకు సంబంధించిన న్యూస్ అని చెప్పి ఆశ్చర్యపరిచాడు. బహుశా రెజీనా కూడా అలాగే ఏదైనా సినిమాను ప్రమోట్ చేస్తుందేమో అనుకుంటే.. పెట్టిన అరగంటలో ఆ పోస్టును డిలీట్ చేసింది రెజీనా. చూస్తుంటే అమ్మడు నిజంగానే ఎవరినో పెళ్ళాడిసినట్లుందే. ఇన్నాళ్ళూ ఆమె ఒక పర్టిక్యులర్ హీరోతో టాలీవుడ్ లో క్లోజ్ గా ఉంది. మొన్న ఒక హీరో పుట్టినరోజు పార్టీకి కూడా వచ్చి నైట్ అంతా పార్టీలోనే ఉంది. చూస్తుంటే.. నిజంగానే పెళ్లి చేసేసుకుందంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/