Begin typing your search above and press return to search.

రెజీనా మరీ ఎడిక్ట్ అయిపోయిందిగా!

By:  Tupaki Desk   |   13 Aug 2019 4:21 AM GMT
రెజీనా మరీ ఎడిక్ట్ అయిపోయిందిగా!
X
కొందరు హీరోయిన్స్ టైం దొరికితే చాలు ఇన్స్టాగ్రామ్ లో వాలిపోతున్నారు. కొందరైతే ఉదయం నుండి రాత్రి వరకూ అందులోనే ఉంటున్నారు కూడా. అయితే హీరోయిన్ రెజీనా కూడా ఇంతే. సోషల్ మీడియాలో భలే ప్రమోట్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో రెజీనా ప్రమోషన్ సూపర్ అనాల్సిందే. ఎవరు సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.

ప్రమోషన్ లో భాగంగా ఎక్కడికి వెళ్లినా ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ పెట్టేసి తన ఫ్యాన్స్ ఖుషీ చేస్తుంది. ఈ రోజు మీడియాతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ ఆ ఇంటర్వ్యూ ని కూడా లైవ్ పెట్టేసి రిపోర్టర్ల మొఖాలను చూపించింది. అయితే చాలా సేపు వరకూ లైవ్ పెట్టిన రెజీనా ఆ తర్వాత లైవ్ ఆపేసి ఇంటర్వ్యూ కంటిన్యూ చేసింది. అయితే ఇదంతా రిపోర్టర్లకు కొత్తగా అనిపించింది. ప్రింట్ - వెబ్ రిపోర్టర్లు రెజీనా ఇన్ స్టాగ్రామ్ కి మరీ ఎడిక్ట్ అయిపోయిందని నవ్వుకున్నారు.

ఏవరేమనుకుంటేనేం రెజీనా మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో తన సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ ఫ్యాన్స్ కి మరింత దగ్గరవుతోంది. ఇప్పటికే అమ్మడికి ఇన్ స్టాలో మిలియన్ పైనే ఫాలోవర్స్ ఉన్నారు . అదే ప్రమోషన్ కంటిన్యూ చేస్తూ ఫ్యాన్స్ ఇలాగే దగ్గరగా ఉంటే త్వరలోనే రెండు మిలియన్ ఫాలోవర్స్ మార్క్ దాటేయడం ఖాయం.