Begin typing your search above and press return to search.
వీడియో : ముద్దుగుమ్మ బీచ్ కసరత్తులు
By: Tupaki Desk | 8 Dec 2020 2:18 PM ISTతెలుగులో పలు సినిమాల్లో నటించిన రెజీనాకు అదృష్టం కలిసి రాకపోవడంతో నటిగా మంచి గుర్తింపు వచ్చినా కూడా ఎక్కువగా అవకాశాలు రాలేదు. ముఖ్యంగా స్టార్స్ ఈమెను పెద్దగా కన్సిడర్ చేయలేదు. ఇటీవల ఈమె చిరంజీవితో ఆచార్య సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈమె ఒక అడ్వంచర్ సినిమాను చేయబోతుంది. అందులో యాక్షన్ సన్నివేశాల కోసం ఈమె ప్రస్తుతం కసరత్తులు చేస్తోంది. ముద్దుగుమ్మ రెజీనా బీచ్ లో చేస్తున్న కసరత్తులు వైరల్ అవుతున్నాయి.
తెలుగు మరియు తమిళంలో రూపొందబోతున్న ఆ సినిమా కోసం రెజీనా కండలు పెంచుతోంది. 30 కేజీల వెయిట్ ను బుజాలపై మోసుకుంటూ వర్కౌట్ లు చేయడంతో పాటు చాలా కష్టమైన వర్కౌట్ లను చాలా సింపుల్ గా ఈ అమ్మడు చేసింది. మొత్తానికి ఈ అమ్మడు చేసిన వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందంగా ఉండటంతో పాటు ఫిజిక్ విషయంలో హీరోయిన్స్ ఎంతగా కష్టపడుతారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రెజీనా కష్టంకు ఫలితం దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.