Begin typing your search above and press return to search.

సింగిల్ గానే కవర్ చేసేస్తోంది

By:  Tupaki Desk   |   26 Aug 2016 6:49 AM GMT
సింగిల్ గానే కవర్ చేసేస్తోంది
X
టాలీవుడ్ తో కోలీవుడ్ ని కూడా కవర్ చేసేస్తున్నా రెజీనా కసాండ్రా టైమ్ అంత గొప్పగా ఏం లేదు. 2016లో ఇప్పటికి అమ్మడి సినిమా వచ్చింది ఒకే ఒక్కటి. ఆ శౌర్య కూడా బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. ఇప్పుడు శంకర.. జ్యో అచ్యుతానందలతో పాటు.. తమిళ్ లో రెండు చిత్రాలను లైన్ లో పెట్టేసింది. వీటిలో ఒకటి ఎస్ జే సూర్యతో కాగా.. మరొకటి సందీప్ కిషన్ తో చేస్తోంది. అన్నింటి మీదా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి కానీ.. తీరా రిజల్ట్ దగ్గరకొచ్చేసరికే అమ్మడికి షాకులు ఎదురవుతున్నాయి.

అందుకే ఇప్పుడు జ్యో అచ్చుతానంద విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోదలచుకోలేదీ రెజీనా. జ్యో అచ్యుతానంద మూవీలో ఇద్దరు హీరోలున్నారు. నారా రోహిత్ తో పాటు నాగశౌర్య కూడా నటించాడు. అయితే వీళ్లిద్దరూ ఇంకా ప్రచారంలోకి దిగకపోయినా.. రెజీనా మాత్రం స్టార్ట్ చేసేసింది. ఈ మూవీని సెప్టెంబర్ 9న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాత అనౌన్స్ చేశాడు. అంటే విడుదలకు ఇంకా 15 రోజుల టైమ్ ఉన్నా.. రెజీనా ఇప్పిటకే యాక్టివ్ గా మారిపోయింది.

పబ్లిసిటీ విషయంలో తన పార్ట్ ని ప్రారంభించేసింది. ఫోటో షూట్స్ చేయడం.. ఎఫ్ఎం రేడియోల చుట్టూ తిరగడం కూడా మొదలుపెట్టేసింది రెజీనా. ఇదంతా హిట్ కొట్టేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చేసేందుకు చేసే ప్రయత్నాలే అని స్పెషల్ గా చెప్పుకోవాల్సిన పని లేదు కదా.