Begin typing your search above and press return to search.

సుభాష్ చంద్రబోస్ బృంద సభ్యుడిగా రానా

By:  Tupaki Desk   |   17 Oct 2016 11:30 AM GMT
సుభాష్ చంద్రబోస్ బృంద సభ్యుడిగా రానా
X
‘బాహుబలి’లో భల్లాలదేవుడి క్యారెక్టర్ చేశాక రానా దగ్గుబాటి రేంజే మారిపోయింది. అతడి కోసం ఇటు సౌత్.. అటు నార్త్ నుంచి దర్శక నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఆల్రెడీ అతను కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో చేస్తున్నాడు. అందులో ‘ఘాజి’ ఒకటి. ఇది కొన్ని దశాబ్దాల కిందటి సబ్ మెరైన్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ సినిమా.

దీంతో పాటు మరో పీరియాడిక్ మూవీలో రానా కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా గురించి హీరోయిన్ రెజీనా కసాండ్రా వెల్లడించడం విశేషం. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన యోధుడు సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో సభ్యుడిగా రానా కనిపించబోతున్నట్లు రెజీనా తెలపడం విశేషం. ఈ సినిమా కథ 1945 నాటి పరిస్థితుల్లో సాగుతుందట. రెజీనా.. రానాను పెళ్లిచేసుకోబోయే చెట్టియార్ అమ్మాయి పాత్రలో కనిపించబోతోందట. తన పాత్ర చాలా సింపుల్ గా ఉంటుందని.. తక్కువ మేకప్ తో చీరలో కనిపిస్తానని రెజీనా వెల్లడించింది.

చెన్నై.. కోచి ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ కూడా జరిగినట్లు తెలిపింది. ఐతే ఈ సినిమా ఏయే భాషల్లో తెరకెక్కుతున్నది.. దర్శకుడెవరు.. నిర్మాత ఎవరు అన్నది రెజీనా వెల్లడించలేదు. ఇది తమిళ దర్శకుడు బాల తెరకెక్కిస్తున్న సినిమానా.. లేక ఎవరైనా బాలీవుడ్ దర్శకుడు తీస్తున్న చిత్రమా అన్నది క్లారిటీ లేదు. త్వరలోనే దీని వివరాలు వెల్లడి కావచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/