Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అమెరికాలో రెజీనా హొయలు

By:  Tupaki Desk   |   13 Nov 2017 7:03 AM GMT
ఫోటో స్టోరి: అమెరికాలో రెజీనా హొయలు
X
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎంత ఇమేజ్ వచ్చినా ఎక్కువగా షూటింగ్ లతోనే వారు బిజీగా ఉంటారు. ఎపుడైనా ఖాళీ దొరికితే అలా ఇతర వేడుకల్లో కనిపిస్తారు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు ప్రతి ఇండస్ట్రీలోని హీరోలు కుదిరితేనే ఇతర పనులు పెట్టుకుంటారు. అయితే హీరోయిన్స్ మాత్రం అలా కాదండోయ్.. కుదరకపోయినా తప్పకుండా వస్తామని ఓ షెడ్యూల్ సెట్ చేసుకుంటారు.

ఈ రోజుల్లో హీరోయిన్స్ ప్రయివేట్ ఇన్విటేషన్స్ వస్తే కాదనకుండా వెళుతున్నారు. ముఖ్యంగా విదేశాల్లో ఆహ్వానాలు అందితే ఎగిరిపోతున్నారు. ఈ మధ్య చెన్నయ్ సోయగం రెజీనా కూడా తెలుగు వారి ఆహ్వానాలను బలే అందుకుంటోంది. ఏ మాత్రం రాను అని చెప్పకుండా నవ్వుతూ తప్పకుండా వస్తానని చెబుతోందట. రీసెంట్ గా అమెరికాలో జరిగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఒహాయో రాష్ట్రం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లిన రెజీనా గ్లామర్ డ్రెస్సుతో దర్శనం ఇచ్చి హొయలు పోయింది.

అమ్మడి అదృష్టం ఏమో గాని హిట్స్ లేకపోయినా ఆధారణ మాత్రం బాగానే దక్కుతోంది. చివరికి లిమిట్స్ ధాటి గ్లామర్ డోస్ పెంచినా సినిమాలు ఆడటం లేదు గాని రెజినాకు మాత్రం ఆహ్వానాలు బాగా అందుతున్నాయి. ఇక వేడుకలో బ్లూ ఫ్యాషన్ డ్రెస్ లో అమ్మడి అందాన్ని చూసిన అందరు థ్రిల్ కి లోనయ్యారట. గత రెండు రోజులుగా రెజీనా అమెరికాలో పలు కార్యక్రమాలలో పాల్గొనడంతో వేడుకలకే అందం వచ్చిందని అందరు ఆమెను పొగడడటంతో బలే సంబరపడిపోయానని రెజీనా చెబుతోంది.