Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో ఇలా బాగోదేమో రెజీనా!!

By:  Tupaki Desk   |   15 Sept 2016 1:00 AM IST
బాలీవుడ్ లో ఇలా బాగోదేమో రెజీనా!!
X
టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందుకు కారణం అమ్మడు చాలా కాలంగా ఎదురుచూస్తున్న హిట్ దక్కడమే. జ్యో అచ్యుతానంద చిత్రంతో రెజీనా మంచి హిట్ ని సాధించడమే కాదు.. తనలోని యాక్టింగ్ స్కిల్స్ కి బోలెడన్ని మార్కులు కూడా వేయించేసుకుంది.

ఇప్పటికే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కోసం ప్రమోషన్స్ విషయంలో రెజీనా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. టాక్ బాగున్నా సరే.. అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసేస్తోంది. ప్రెస్ మీట్స్.. అక్కడ ఫోటో సెషన్స్ తో అమ్మడి సందడి మామూలుగా లేదు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ ఫోటోల్లో రెజీనా సైజ్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. సినిమాలో కనిపించే లుక్ కి.. బైట కనిపించే రెజీనాకి ఇంత డిఫరెన్స్ ఏంటబ్బా అనుకోవాల్సి వస్తోంది. అమ్మడి ఈ లుక్స్ చూస్తుంటే.. ఈ మధ్య సైజుల మీద శ్రద్ధపెట్టలేదనే విషయం అర్ధమవుతోంది.

బాలీవుడ్ లో వచ్చిన ఛాన్స్ తో మహా సంతోషంగా ఉన్న రెజీనా.. దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలంటే.. ఇలా లావయిపోవడం మాత్రం చేయకూడదు. ఇక్కడి మాదిరిగా ట్యాలెంట్ చూపిస్తే.. కొలతలు పట్టించుకోని పరిస్థితి అక్కడ ఉండదు. పైగా సైజ్ జీరో భామలకు ఉన్న డిమాండ్ మిగిలినోళ్లకు ఉండదనేది బాలీవుడ్ చెప్పిన సత్యం. మరి ఇప్పటికైనా రెజీనా జాగ్రత్త పడితే బెటర్!