Begin typing your search above and press return to search.
హీరోయిన్ 100 కి.మీల ఛాలెంజింగ్ రైడ్
By: Tupaki Desk | 24 Dec 2020 10:00 AM ISTహీరోయిన్స్ అంటే సుకుమారంగా సున్నితంగా ఉంటారని అంతా అనుకుంటారు. కాని ఈమద్య కాలంలో హీరోయిన్స్ వర్కౌట్లు చేసి.. యోగాలు చేసి హీరోల కంటే దృడంగా మారుతున్నారు. కొందరు హీరోయిన్స్ ఏకంగా లేడీ బాడీ బిల్డర్స్ అన్నట్లుగా కనిపిస్తున్నారు. హీరోయిన్ రెజీనా ఎప్పటికప్పుడు సాహస యాత్రలు.. ఛాలెంజింగ్ టాస్క్ లు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల ఈమె ఏకంగా 104 కిలోమీటర్లు సైకిల్ రైడ్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. క్యాన్సర్ అవగాహణ మరియు ఫండ్ రైజింగ్ కోసం ఒక ఎన్జీవో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ రైడ్ ను ప్రారంభించారు. అమ్మాయిల ఆ రైడ్ లో రెజీనా పాలు పంచుకున్నారు.
రెజీనా హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వరకు 104 కిలో మీటర్ల మేరకు ప్రొఫెషనల్ రైడర్స్ తో కలిసి వారితో సమానంగా సైకిల్ ను రైడ్ చేసింది. వైల్డ్ వారియర్ హిమాలయన్ అడ్వెంచర్ రేస్ పేరుతో సాగుతున్న ఈ ఛారిటీ కార్యక్రమంలో భాగంగా రెజీనా తనవంతు భాగస్వామ్యం అవ్వడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆమె ఫిట్ నెస్ కు అంతా అభినందనలు తెలియజేశారు. హీరోయిన్ అయ్యి ఉండి ఇంత భారీ రేస్ లో పాల్గొనడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. గతంలో కూడా రెజీనా రేస్ లో పాల్గొన్న సందర్బాలున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో ప్రత్యేక పాటలో నటించడంతో పాటు రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.