Begin typing your search above and press return to search.

గుండె పిండినావమ్మ రెడ్డెమ్మ తల్లి

By:  Tupaki Desk   |   16 Oct 2018 12:57 PM IST
గుండె పిండినావమ్మ రెడ్డెమ్మ తల్లి
X
దసరా సీజన్ ని దుమ్మురేపే కలెక్షన్స్ తో అదరగొడుతున్న అరవింద సమేత వీర రాఘవ కాస్త స్లో అయినట్టు రిపోర్ట్స్ ఉన్నప్పటికీ మరీ భయపెడే రీతిలో అయితే కాదు. పోటీ లేకపోవడంతో పాటు వరస సెలవుల నేపధ్యంలో రాఘవ రెడ్డి జనాన్ని థియేటర్ల దాకా రప్పిస్తున్నాడు. తాజాగా ఇందులో పెంచలదాస్ రాసి పాడిన ఊరికి ఉత్తరాన అంటూ సాగే పాటను కవర్ సాంగ్ పేరిట వీడియో రూపంలో విడుదల చేసారు. కేవలం రెండు నిముషాలు మాత్రమే ఉన్న ఈ పాట ప్రీ క్లైమాక్స్ లో బసిరెడ్డి పాత్ర చనిపోయాక బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంది.

ఈశ్వరి రావు రెడ్డెమ్మ తల్లిగా ఊరి బాగు కోసం తన బొట్టు కుంకుమ అలాగె ఉంచుకోవడంలోని వ్యధను వివరిస్తూ పెంచలదాస్ పాడిన ఈ పాట బాగా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. వీడియో లో త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత చినబాబు పక్కనే సోఫా మీద కూర్చోగా థమన్ తన ప్రైవేట్ స్టూడియోలో కంపోజ్ చేస్తూ దాస్ కు సూచనలు ఇవ్వడం ఇందులో చూడొచ్చు.

మొత్తానికి నాలుగే పాటలు ఉన్నాయే అని కాస్త అసంతృప్తిలో ఉన్న అభిమానులకు ఈ రూపంలో ఐదో పాట చేరి కాస్త ఊరట దక్కింది అని చెప్పొచ్చు. కాకపోతే దీంతో కలిపి మొత్తం మూడు ఎమోషనల్ సాంగ్స్ ఉన్న జూనియర్ ఆల్బమ్ గా ఇది ప్రత్యేకత సంతరించుకుంది. యుట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొద్దీ నిమిషాలకే లక్షల వ్యూస్ కోసం పరుగులు పెట్టడం చూస్తే దీనికి ఎంత ఆదరణ దక్కిందో అర్థమవుతోంది. ఈశ్వరి రావు జూనియర్ చేయి పట్టుకుని తీసుకెళ్లే చిన్న బిట్ ని ఇందులో చూపించడం ప్లస్ గా మారింది. లోతైన సాహిత్యంతో పెంచలదాస్ రాయలసీమ మాండలికంలో రాసి పాడిన ఈ పాట బాగా వైరల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కృష్ణార్జున యుద్ధంలో దారి చూడు దుమ్ము చూడు పాటతో ఆకట్టుకున్న పెంచలదాస్ దీంతో అంతకు రెట్టింపు పేరు వచ్చేలా ఉంది. సీమ యాసలో సినిమాలు తీస్తే ఇతనికి మంచి అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.