Begin typing your search above and press return to search.
'రెడ్' టీజర్: #రాపో డబుల్ ఇస్మార్ట్ గురూ
By: Tupaki Desk | 28 Feb 2020 1:10 PM GMTరియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ఇది అంటూ రామ్ - కిశోర్ తిరుమల బృందం ఆరంభమే `రెడ్` పై క్యూరియాసిటీ పెంచింది. రామ్ పోతినేని (#రాపో) ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా సినిమా రెడ్ పోస్టర్ లీక్ లు ఆకట్టుకున్నాయి. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ కం లవ్ ఎంటర్ టైనర్.. ఆద్యంతం ఎమోషన్స్ రక్తి కట్టిస్తాయని నిర్మాత వెల్లడించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.
తాజాగా రెడ్ టీజర్ రిలీజైంది. టీజర్ లో యథావిధిగా రామ్ ఎనర్జీ.. డబుల్ ధమాకా ఇస్మార్ట్ ట్రీట్ అదిరింది. ఇస్మార్ట్ శంకర్ లో అభిమానులకు డబుల్ ట్రీట్ ఎలా కనెక్టయ్యిందో.. ఇప్పుడు మరోసారి రెండు పాత్రలతో కనెక్టింగ్ ఎలిమెంట్ తో రక్తి కట్టిస్తున్నాడు. ఒకడు క్రిమినల్ అయితే ఇంకొకడు సాఫ్ట్ రాపోలా కనిపిస్తున్నాడు. టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్ గా ఇంతకీ ఎవరు క్రిమినల్? అన్నంత సస్పెన్స్ ని క్రియేట్ చేయడంలో కిశోర్ టీమ్ సక్సెసైంది. ఊహకందని ట్విస్టులతో ఆద్యంతం రంజింపజేస్తారా? అన్నది పూర్తి నిడివి సినిమా చూస్తే కానీ తెలీదు. ``క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేసు చూడడం ఇదే ఫస్ట్ టైమ్`` అంటూ టీజర్ లో ఆసక్తిని పెంచారు. సిద్ధార్థ్ .. ఆదిత్య ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్.. డిఫరెంట్ వరల్డ్స్! అని రివీల్ చేశారు. ఇందులోనే నివేద- నాజర్ కాప్ ఆపరేషన్ ఏమిటన్నది వేచి చూడాలి.
ఇంతకుముందు లానే రామ్ లో ఎనర్జీ లెవల్ ఏమాత్రం తగ్గలేదు. రెండు వేరియేషన్స్ ని కొత్తగా ట్రై చేశాడు. గుబురు గడ్డం తో మాస్ లుక్ ఆకట్టుకుంది. టక్ టై సెటప్ తో క్లాసు లుక్ బావుంది. రామ్ ఎనర్జీ బావుంది. అయితే కుర్చీ అంచుమీద కూచునేంత సస్పెన్స్ థ్రిల్ ఏం ఉంటుంది? అన్నదే సినిమా జయాపజయాల్ని నిర్ణయిస్తుంది. టీజర్ ఆద్యంతం క్రైమ్ థ్రిల్ ని హైలైట్ చేసినట్టు లవ్ ఎలిమెంట్ ని ఎక్కడా చూపించలేదు. అయితే ఈ సినిమాలో లవ్ .. వినోదం.. సెంటిమెంటుకు కొదవ ఉండదని చిత్రబృందం చెబుతోంది. గజినీలా ఇంకేదైనా లవ్ షేడ్ కానీ లేదా మరో రకంగా మదర్ సెంటిమెంట్ కానీ క్రిమినల్ బ్యాక్ డ్రాప్ కి కనెక్టయ్యిందా? అన్నది ట్రైలర్ లో ఏమైనా చూపిస్తారేమో కాస్త ఆగి చూడాలి. ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ రీరికార్డింగ్ పెద్ద ప్లస్ కానుందని టీజర్ చెబుతోంది. సమీర్ రెడ్డి- పీటర్ హెయిన్స్ లాంటి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండడం అదనపు బలం అనే చెప్పాలి.