Begin typing your search above and press return to search.

‘రెడ్ నోటీస్’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?

By:  Tupaki Desk   |   9 July 2021 10:30 AM GMT
‘రెడ్ నోటీస్’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?
X
క‌రోనా నేప‌థ్యంలో సినీ ప్రేక్ష‌కులు దాదాపుగా ఓటీటీకి అల‌వాటు ప‌డిపోయారు. ఇక‌, వినోదం అంటే.. ఓటీటీనే గుర్తుకు వ‌చ్చేలా ప‌రిస్థితి మారుతోంది. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మోస్త‌రు బ‌డ్జెట్లోనే వెబ్ సిరీస్ లు, చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఓటీటీ సంస్థ‌లు.. భారీ చిత్రాల‌ను సైతం నిర్మించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇదేకోవ‌లో ప్ర‌ముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ నిర్మించిన చిత్రం ‘రెడ్ నోటీస్‌’.

ఓటీటీ చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది నెట్ ఫ్లిక్స్‌. ఏకంగా 200 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేసి ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. మ‌న క‌రెన్సీలో దాదాపు 1500 కోట్ల రూపాయ‌ల‌కు పైనే. రాస‌న్ మార్ష‌ల్ థంబ‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. రాబ‌రీ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోంది. గాడ్ గోట్‌, రెనాల్డ్స్, రాక్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా యాక్ష‌న్ మూవీస్ ప్రేక్ష‌కులు ఎద‌రు చూస్తున్న ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 12న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. డ్వేన్ జాన్స‌న్ (రాక్‌) సోష‌ల్ మీడియాలో ఈ విష‌యాన్ని అనౌన్స్ చేశారు. ఈ మేర‌కు ఇన్ స్టాలో పోస్టు చేసిన రాక్‌.. త‌మపై న‌మ్మ‌కంతో ఇంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నందుకు నెట్ ఫ్లిక్స్ సంస్థ‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ మూవీలో గాడ్ గోట్‌, రెనాల్డ్స్ క్రిమిన‌ల్స్ గా న‌టిస్తున్నారు. ఎఫ్బీఐ ఆఫీస‌ర్ గా రాక్ న‌టిస్తున్నారు. మోస్ట్ అడ్వంచ‌ర‌స్ మూవీగా ఈ చిత్రం ఉండ‌బోతోంద‌ని, యాక్ష‌న్ మూవీస్ ను ఇష్టప‌డే వారికి పండ‌గేన‌ని నెట్ ఫ్లిక్స్ యాజ‌మాన్యం ప్ర‌క‌ట‌కించింది. దీంతో.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మ‌రి, ఈ మూవీ ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుంద‌న్న‌ది చూడాలి.