Begin typing your search above and press return to search.

#RED ఎనర్జిటిక్ రామ్ మ‌రోసారి ఇస్మార్ట్ వ‌సూల్

By:  Tupaki Desk   |   15 Jan 2021 3:58 AM GMT
#RED ఎనర్జిటిక్ రామ్ మ‌రోసారి ఇస్మార్ట్ వ‌సూల్
X
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ క‌థానాయ‌కుడిగా కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన రెడ్ సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లోకి రిలీజైన సంగ‌తి తెలిసిన‌దే. స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సంక్రాంతి బ‌రిలో క్రాక్ చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో సేఫ్ జోన్ కి వెళుతోంది. రెడ్ స‌న్నివేశ‌మేంటి? అంటే...ఎన‌ర్జిటిక్ రామ్ తొలి రోజు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినా క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఓకే అనిపించుకున్నాడు.

50శాతం ఆక్యుపెన్సీ నియమం ఉన్నా తొలిరోజు వ‌సూళ్లు ఫ‌ర్వాలేద‌నిపించేలా ఉన్నాయ‌ని ట్రేడ్ చెబుతోంది. క‌రోనా క్రైసిస్ భ‌యాల్ని వ‌దిలేసి జనం అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తూ థియేట‌ర్ల‌కు విచ్చేస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ గా న‌టించిన‌ రామ్ మ‌రోసారి చ‌క్క‌ని న‌ట‌న తో మాస్ కి క‌నెక్ట‌య్యే వీలుంది. రెడ్ మూవీ మెజారిటీ థియేట‌ర్ల‌లో రిలీజ‌వ్వ‌డంతో వ‌సూళ్ల ప‌రంగా క‌లిసొచ్చింది.

శ‌ని.. ఆదివారాలు సెల‌వులే కావ‌డం కూడా టికెట్ బుకింగ్స్ కి క‌లిసి రానుంది. లాక్ డౌన్ త‌ర్వాత ఇది కొంత ఊర‌ట‌. మ‌రోవైపు పండ‌గ‌కు నాలుగు సినిమాల మ‌ధ్య పోటీ ఉండ‌డంతో ఆ మేర‌కు వ‌సూళ్ల షేరింగ్ త‌ప్ప‌నిస‌రి. లాంగ్ ర‌న్ లో రెడ్ కి మంచి వ‌సూళ్లు ద‌క్కుతాయా? అన్న‌ది చూడాలి.