Begin typing your search above and press return to search.

రికార్డ్‌ : ఒక్క పాటతో సినిమా సగం బడ్జెట్‌ రికవరీ

By:  Tupaki Desk   |   18 Aug 2020 4:20 PM IST
రికార్డ్‌ : ఒక్క పాటతో సినిమా సగం బడ్జెట్‌ రికవరీ
X
బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ పేరున్న యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. కరోనా వచ్చి ఉండకుంటే ఈ సినిమా సమ్మర్‌ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదలకు రెడీ అయ్యి ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టిన సమయంలో కరోనా కారణంగా థియేటర్లు మూతబడి సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆమద్య ఓటీటీ ద్వారా విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాని ప్రదీప్‌ మొదటి సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా థియేటర్‌ లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని నీలి నీలి ఆకాశం పాట గత ఆరు ఏడు నెలలుగా ట్రెండ్‌ అవుతూనే ఉంది.

యూట్యూబ్‌ లో ఈ పాట 200 మిలియన్‌ వ్యూస్‌ ను దక్కించుకుంది. హీరో మొదటి సినిమా పాట ఈ స్థాయిలో వ్యూస్‌ ను దక్కించుకోవడం ఇదే ప్రథమం. ఇక ఈ పాటతో వచ్చిన ఆదాయంతో సినిమా సగం బడ్జెట్‌ రికవరీ అయ్యి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఆడియో రైట్స్‌ ను నిర్మాతలు అమ్మి ఉంటారు. అది ఎంతకు అమ్మారు అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆ పాటతో వచ్చిన ఆదాయం సినిమా బడ్జెట్‌ లో సగానికి ఎక్కువగా ఉంటుందని కొందరు లెక్కలు వేస్తున్నారు.

యూట్యూబ్‌ ఇంకా ఇతర వీడియో స్ట్రీమింగ్‌ యాప్స్‌ మరియు ఆడియో స్ట్రీమింగ్‌ యాప్స్‌ అయిన జియో సావన్‌ ఇతర యాప్స్‌ ద్వారా కోటికి పైగా ఆదాయం వచ్చి ఉంటుందని అంటున్నారు. ఒక్క పాటతో ఈ స్థాయి ఆదాయం రావడం రికార్డ్‌ కాకపోవచ్చు. కాని చిన్న బడ్జెట్‌ సినిమా పాటకు ఈ స్థాయిలో ఆదాయం రావడం అనేది సంచలనంగా చెబుతున్నారు. పాటతో సినిమాకు కూడా విపరీతమైన క్రేజ్‌ దక్కింది. కనుక థియేటర్‌ రైట్స్‌ ఓటీటీ మరియు శాటిలైట్‌ రైట్స్‌ కు కూడా భారీ డిమాండ్‌ ఉంది. ఆ మొత్తం కలిపితే నిర్మాత లాభం పెట్టుబడికి ఎన్ని రెట్టు ఉంటుందో అంటూ కొందరు ట్రేడ్‌ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.