Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ కు ఆకాశమే హద్దా

By:  Tupaki Desk   |   10 March 2019 7:19 AM GMT
ఆర్ ఆర్ ఆర్ కు ఆకాశమే హద్దా
X
వచ్చే ఏడాదికే కాదు ఈ దశాబ్దంలోనే మోస్ట్ క్రేజీ టాలీవుడ్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఒకపక్క జరుగుతూనే మరోవైపు బిజినెస్ వ్యవహారాలు చక్కదిద్దుకుంటోంది . విడుదలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ బయ్యర్లను iఇప్పుడే ఖరారు చేసుకుంటే అడ్వాన్సు రూపంలో కొంత పెట్టుబడిని సమీకరించుకునే అవకాశం దొరుకుతుంది. ఓవర్సీస్ లో రాజమౌళి సినిమాలకు మాములుగానే డిమాండ్ ఎక్కువ. స్టార్ లేని ఈగ మర్యాద రామన్న లాంటివి సైతం అక్కడ రికార్డులు సాధించాయి. ఇక ప్రభాస్ లాంటి పెద్ద రేంజ్ ఉన్న హీరోతో చేసిన బాహుబలి గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కాంబో అనేసరికి అంచనాలకు అడ్డుకట్ట వేయడం ఎవరి తరం కావడం లేదు. అందుకే రేట్లు కూడా ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ ఓవర్సీస్ రైట్స్ 75 కోట్ల దాకా దానయ్య ఆశిస్తున్నట్టు సమాచారం. ఇందులో జపాన్ చైనా కలపలేదట. మాములుగా చూస్తే ఇది చాలా భారీ మొత్తం. కాని రాజమౌళి బ్రాండ్ తో పాటు నందమూరి కొణిదెల స్టార్లు తోడయ్యారు కాబట్టి ఇంత మొత్తం ఈజీగా వచ్చేస్తుందని దానయ్య భరోసా ఇస్తున్నాడట.

ఈ కారణంగానే రెగ్యులర్ కమర్షియల్ మసాలా కాకుండా అన్ని దేశాల్లోనూ ఆదరించే విధంగా ప్రీ ఇండిపెండెన్స్ నేపధ్యాన్ని తీసుకున్నట్టు చెబుతున్నారు. పాతిక శాతం షూటింగ్ పూర్తి కాకుండానే ఆర్ ఆర్ ఆర్ కు ఈ రేంజ్ హైప్ రావడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడీ ఓవర్సీస్ డీల్ ఇంకా ఓకే కాలేదు కాని వచ్చిన టాక్ ప్రకారం డిమాండ్ అయితే ఈ స్థాయిలో ఉందట