Begin typing your search above and press return to search.

జియో టీజ‌రే వ‌దిలింది! ఇంకా ట్రైల‌ర్ సినిమా ముందుంది?

By:  Tupaki Desk   |   15 April 2023 2:30 AM IST
జియో టీజ‌రే వ‌దిలింది! ఇంకా ట్రైల‌ర్ సినిమా ముందుంది?
X
టెలికాం రంగంలో జీయో పంచ్ కి హేమాహేమీలే తొక ముడ‌వాల్సి వ‌చ్చింది. మార్కెట్లోకి జియో ఎంట్రీతో ఎన్నో సౌల‌భ్యాలు దొరికాయి. అలాగ‌ని ఇవేమి ఉచిత సేవ‌లు కాదు. ముందు జ‌నాల‌కు అల‌వాటు చేయ‌డం..ఆ త‌ర్వా బాదేయ‌డం అన్న‌ది జియో ప్ర‌త్యేక‌త‌. జియో అందిస్తోన్న ప్ర‌తీ సేవ‌పైనా ఇప్పుడు ఆర‌కంగానే కొన‌సాగుతుంది. తాజాగా జియో ఓటీటీని విస్త‌రించే ప‌నిలో ప‌డింది.

ఇటీవ‌లే ముంబైలో జియోస్టూడియోస్ ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వ‌హించింది. త‌మ ప్లాట్ ఫామ్ మీద విడుద‌ల కాబోయే 100 సినిమాలు..వెబ్ సిరీస్ లు టైటిల్స్ ఓ ట్రైల‌ర్ రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. వంద‌ల కోట్లు బిజినెస్ చేస్తుంద‌ని అంచ‌నా ఉన్నా షారుక్ ఖాన్ 'డుంకీ 'చిత్రాన్ని జియో కొనుగోలు చేసి షాక్ ఇచ్చింది. ఇది శాంపిల్ మాత్ర‌మే. మును ముందు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల‌న్ని జియోనే కొనుగోలు చేస్తుంది.

భ‌విష్య‌త్ లో సినిమా అమ్మాలంటే జియోకి మాత్ర‌మే అమ్మేలా! గేమ్ ప్లాన్ చేసి మిగ‌తా సంస్థ‌ల్ని మ‌ట్టి క‌రిపిస్తుంది. 2023 ఐపీఎల్ ఫ్రీగా చూసే వెసులు బాటు క‌ల్పించి హాట్ స్టార్ కి ఇండియాలో తొక్కేసింది. ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో జియో ఓటీటీ మ‌రిన్ని అద్భుతాల‌కు తెర తీస్తుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఓటీటీ కార్పోరేట్ కంపెనీల‌కు జీయో నుంచి పెను ప్ర‌మాద‌మే ముంచి ఉంద‌న్న‌ద వాస్త‌వం.

ఇండియా వైడ్ ఎన్నో కంపెనీలు వెలిసాయి. నెట్ ప్లిక్స్..అమెజాన్.. సోనీలివ్.. హాట్ స్టార్ లాంటి ఓటీటీలు ఇండియాలో అగ్ర‌గామిగా కొన‌సాగుతున్నాయి. తెలుగు నుంచి చాలా మంది నిర్మాత‌లు సొంతంగా ఓటీటీ లు స్టార్ట్ చేసారు.

ఈ పోటీకిలోకి జియో ఎంట్రీ ఇస్తే సీన్ మారిపోతుందన‌డానికి మొన్న‌టి ట్రైల‌ర్ ఉదాహ‌ర‌ణ‌. జియో ఓటీటీలో ముందుగా ఉచితంగా సినిమాలు చూసే వెసులు బాటు క‌ల్పిస్తుంది. అది జ‌నాల‌కు బాగా అల‌వాటు అవుతుంది. భారీగా సబ్ స్క్రైబ‌ర్లు సాధిస్తుంది. దీంతో అప్ప‌టి కే ఉన్న ఓటీటీల‌కు ఎదురు దెబ్బ త‌ప్ప‌దు.