Begin typing your search above and press return to search.

'రెక్కీ' ట్రైలర్: రా అండ్ రస్టిక్ పీరియాడికల్ క్రైమ్ డ్రామా..!

By:  Tupaki Desk   |   9 Jun 2022 7:36 AM GMT
రెక్కీ ట్రైలర్: రా అండ్ రస్టిక్ పీరియాడికల్ క్రైమ్ డ్రామా..!
X
ఎప్పటికప్పుడు సరికొత్త వినోదంతో వీక్షకులను ఆకట్టుకుంటూ ఓటీటీలలోనే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ గా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది 'ZEE 5'. బ్లాక్ బస్టర్ సినిమాలు - డైరెక్ట్ ఓటీటీ రిలీజులతో పాటుగా ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తూ సబ్ స్క్రైబర్స్ ను పెంచుకుంటూపోతోంది.

'జీ 5' ఓటీటీ తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ వంటి ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్ లలో ఫ్రెష్ కంటెంట్ ను వీక్షకులకు నిర్విరామంగా అందిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగులో ''రెక్కీ'' అనే సరికొత్త ఒరిజినల్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతోంది.

రోజాపూలు శ్రీరామ్ - శివ బాలాజీ - ఎస్తేర్ - ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ''రెక్కీ''. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను జూన్ 17వ తేదీన జీ5 ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన 'రెక్కీ' మోషన్ పోస్టర్ టీజర్ ఈ సిరీస్ పై ఆసక్తిని కలిగించింది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇది 1990స్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన రా అండ్ రస్టిక్ రూరల్ పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

తాడిపత్రిలో మరో ఆరు నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరగనుండగా.. అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది అని చెప్పడంతో 'రెక్కీ' ట్రైలర్ ప్రారంభమవుతుంది. మూడేళ్ళ క్రితం జరిగిన ఓ మర్డర్ కేసును చేధించడానికి తాడిపత్రికి వచ్చిన పోలీసాఫీసర్ గా శ్రీరామ్ కనిపించారు.

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ హత్య నేపథ్యంలో ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో ఈ సిరీస్‌ రూపొందినట్లు తెలుస్తోంది. ఆ హత్య చేసిందెవరు? ప్రణాళిక రచించిందెవరు? శ్రీరామ్ ఈ కేసును ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో ఎలాంటి భయంకరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి? అనేది తెలియాలంటే 'రెక్కీ' చూడాల్సిందే.

ఇందులో శ్రీరామ్ - శివ బాలాజీ - ఎస్తేర్ - ధన్య బాలకృష్ణ.. ఇలా అందరూ సీరియస్ మూడ్ లోనే కనిపిస్తున్నారు. ఆడుకాలమ్ నరేన్ - సమ్మెట గాంధీ - జీవా - శరణ్య ప్రదీప్ - రాజశ్రీ నాయర్ - సమీర్ తదితరులు ఈ సిరీస్ లో ఇతర పాత్రలు పోషించారు.

గ్రామీణ ఫ్యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన 'రెక్కీ' సిరీస్ 7 ఎపిసోడ్స్ గా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ పై కేవీ శ్రీరామ్ ఈ సిరీస్ ను నిర్మించారు. శ్రీరామ్ మద్దూరి సంగీతం సనకూర్చగా.. రామ్ కె మహేష్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.