Begin typing your search above and press return to search.

ఒకే ప్రేమ్ లో రెబ‌ల్ స్టార్స్.. ఫ్యాన్స్ కి డ‌బుల్ కిక్!

By:  Tupaki Desk   |   22 Jun 2022 12:30 PM GMT
ఒకే ప్రేమ్ లో రెబ‌ల్ స్టార్స్.. ఫ్యాన్స్ కి డ‌బుల్ కిక్!
X
రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు- ప్ర‌భాస్ మ‌ధ్య అన్యోన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కృష్ణంరాజు న‌ట వార‌సత్వం తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ టాలీవుడ్ లో ఎదిగిన వైనం..అక్క‌డ నుంచి పాన్ ఇండియా స్టార్ గా రీచ్ అయిన విధానం నిజంగా ప్ర‌శంస‌నీయం. డార్లింగ్ గా..యంగ్ రెబల్ స్టార్ గా ప్రేక్ష‌కాభిమానుల గుండెల్లో చిర స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నారు.

ప్ర‌భాస్ నేడు పాన్ ఇండియా స్టార్ గా నీరాజ‌నాలు అందుకుంటున్నారు అంటే! దాని వెనుక ప‌రోక్ష కార‌కులు కృష్ణంరాజు. న‌టుడిగా ఉన్న‌తంగా ఎద‌గ‌డంలో కృష్ణం రాజు సూచ‌న‌లు..స‌ల‌హాలు డార్లింగ్ ఎప్పుడూ తీసుకుంటారు. కొత్త సినిమా క‌మిట్ అయిన వెంట‌నే పెద్దాయ‌న చెవిన విష‌యం వేయాలి. ఆయ‌న ఆశీర్వ‌చ‌నాలు అందుకోవాలి. ఆ త‌ర్వాతే సెట్స్ కి వెళ్లాలి.

ఇలా డార్లింగ్ చేసే ప్ర‌తి ప‌నిలోనూ కృష్ణం రాజు క‌నిపిస్తారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కి పిల్ల‌ని చూసే ప‌నిలోనే పెద్దాయ‌న బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వ‌య‌సు 40 దాటడంతో ఇక ఆల‌స్యం మంచిది కాద‌ని...పిల్ల‌ని వెతికే సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా కృష్ణంరాజు-ప్ర‌భాస్ ఒకే ప్రేమ్ లో చిక్కిన ఫోటో ఒక‌టిప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఇందులో కృష్ణం రాజు చైర్ లో కూర్చుని ఉండ‌గా..ఆ ప‌క్క‌నే డార్లింగ్ నుంచుని క‌నిపిస్తున్నాడు. పెద్దాయ‌న బ్లాక్ క‌ల‌ర్ ష‌ర్ట్ లో మెడ‌లో చైన్ ధ‌రించి న‌వ్వుతూ క‌నిపిస్తున్నారు. ప‌క్క‌నే ప్ర‌భాస్ క్యాజువ‌ల్స్ లో త‌ల‌కి స్కాప్ ధ‌రించి బియ‌ర్డ్ లుక్ లో క‌నిపిస్తున్నారు.

కృష్ణం రాజు లో లుక్ ప‌రంగా చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. అవి వ‌య‌సు తెచ్చిన మార్పులా? లేక డైట్ పాలో చేస్తున్నారా? అన్న‌ది తెలియాలి. గ‌త లుక్ కంటే కృష్ణంరాజు చాలా మార్పులు గ‌మ‌నించవ‌చ్చు.

ఇద్ద‌రు స్టార్లు ఇలా ఒకే ప్రేమ్ లో క‌నిపించ‌డంతో అభిమానుల అనందానికి అవ‌ధుల్లేవ్. ఫోటో పాత‌దే అయినా అభిమానుల‌కు మాత్రం డ‌బుల్ కిక్ ఇస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టంట జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇక డార్లింగ్-కృష్ణం రాజు కొన్ని సినిమాల్లో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే.