Begin typing your search above and press return to search.

రెబ‌ల్ స్టార్ విగ్ర‌హం వ‌చ్చేస్తోంది!

By:  Tupaki Desk   |   21 Sep 2022 9:40 AM GMT
రెబ‌ల్ స్టార్ విగ్ర‌హం వ‌చ్చేస్తోంది!
X
రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబ‌ర్ 11న అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణ వార్త సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. న‌టుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ వేత్త‌గా త‌న‌దైన ముద్ర‌వేసిన రెబ‌ల్ స్టార్ ఆక‌స్మిక మృతిప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నేత‌లు తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. తన యాభై ఏళ్ల‌ సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటని పేర్కొన్నారు.

ఇదిలా వుంటే కృష్ణంరాజు కోరిక మేర‌కు ఆయ‌న అంత్య‌క్రియ‌లు సిటీ ఔట్ స్క‌ర్ట్స్ లోని మోయినాబాద్ లో వున్న ఫామ్ హౌస్ లో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో జ‌రిపించారు. ఫామ్ హౌస్ స‌మీపంలో వున్న గ్రామ‌స్తుల‌తో పాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల నుంచి వ‌చ్చిన కృష్ణంరాజు, ప్ర‌భాస్ అభిమానుల‌తో ఫామ్ హౌస్ ప‌రిస‌రాలు జ‌న‌సందోహంతో నిడిపోయాయి. అశ్ర‌న‌య‌నాల మ‌ధ్య రెబ‌ల్ స్టార్ కు అభిమానులు, కుటుంబ స‌భ్యులు కన్నీటి వీడ్కోలు ప‌లికిన విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మ‌ర‌ణానంత‌రం ఆయ‌న విగ్ర‌హాన్ని కుటుంబ స‌భ్యులు త‌యారు చేయించారు. అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా కొత్త పేట మండ‌లంలోని ప్ర‌ముఖ విగ్ర‌హాల శిల్పి వ‌డ‌యార్ కు కృష్ణంరాజు విగ్ర‌హా త‌యారీ బాధ్య‌త‌ల్ని కుటుంబ స‌భ్యులు అప్ప‌గించారు. ఫైబ‌ర్ తో కూడుకున్న ఈ విగ్ర‌హాన్ని పూర్తి చేయ‌డానికి శిల్పి వ‌డ‌యార్ కు ఆరు రోజులు ప‌ట్టింద‌ట‌.

ఈ ఫైబ‌ర్ విగ్ర‌హ త‌యారీ పూర్త‌వ‌డంతో బుధ‌వారం హైద‌ర‌బాద్ లోని కుటుంబ స‌భ్యుల‌కు పంపుతున్న‌ట్టుగా విగ్ర‌హ శిల్పి వ‌డ‌యార్ పేర్కొన్నారు. శిల్పి వ‌డ‌యార్ రెబ‌ల్ స్టార్ విగ్ర‌హాన్ని త‌యారు చేస్తున్న వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఫైబ‌ర్ విగ్ర‌హాన్ని క‌టుంబ స‌భ్యులు త‌మ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ప్ర‌త్యేకంగా ఆవిష్క‌రించుకోనున్నార‌ని తెలిసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.