Begin typing your search above and press return to search.

#RRR గురించి బాహుబలి రేంజ్ రూమర్!

By:  Tupaki Desk   |   31 Jan 2019 12:01 PM GMT
#RRR గురించి బాహుబలి రేంజ్ రూమర్!
X
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RRR టాలీవుడ్ లోనే కాదు దేశం మొత్తం మీద ఇప్పుడొక క్రేజీ ప్రాజెక్టు. ఈ సినిమాను మరింత క్రేజీగా మార్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడా అంటే.. ఔను అనే సమాధానం వస్తోంది. టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ చరణ్ లతో పాటు మరో స్టార్ హీరోతో క్యామియో చేయించేందుకు రాజమౌళి ఆలోచిస్తున్నాడట.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన క్యామియోను ప్రభాస్ చేత చేయించాలని అలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ఈ దిశగా చర్చలు కూడా జరిగాయనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే ఎన్టీఆర్.. చరణ్ లతో పాటు ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్ ను కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇంతకంటే క్రేజీ ఐడియా మరొకటి ఉండదు కదా? ఇదిలా ఉంటే రాజమౌళి టీమ్ ప్రస్తుతం #RRR సెకండ్ షెడ్యూల్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ షెడ్యూల్ పూర్తికాగానే హీరోయిన్ల ఎంపిక మీద దృష్టి పెడతారట. మూడో షెడ్యూల్ ను ప్రారంభించేలోపు హీరోయిన్ల పేర్లను ప్రకటిస్తారని అంటున్నారు.

ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించే నటీనటుల పేర్లు కూడా ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఆ వివరాలన్నీ త్వరలో వెల్లడవుతాయని అంటున్నారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో క్వాలిటీ విషయంలో రాజీపడకుండా నిర్మిస్తున్నారు.