Begin typing your search above and press return to search.

బాహుబలి మిక్స్‌డ్‌ టాక్‌.. ఓ రీజన్‌

By:  Tupaki Desk   |   14 July 2015 1:15 PM IST
బాహుబలి మిక్స్‌డ్‌ టాక్‌.. ఓ రీజన్‌
X
బాహుబలి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4200 థియేటర్లలో రిలీజైంది. విడుదలైన తొలి మూడో రోజుల్లోనే 160కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్‌ని ఒణికించింది. మగధీర, అత్తారింటికి దారేది పేరిట ఉన్న అన్ని రికార్డుల్ని తిరగరాసింది. అవన్నీ అప్పట్లో కేవలం 1000 థియేటర్లలో మాత్రమే రిలీజయ్యాయి.

అయితే బాహుబలికి మొదటి నుంచి క్రియేట్‌ చేసిన హైప్‌ దృష్ట్యా భారీగా థియేటర్లను ప్లాన్‌ చేసి అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్‌ చేశారు. ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది సినిమాల రికార్డులన్నిటినీ ఈ చిత్రం తిరగరాసింది. అయినా ఈ సినిమా రిలీజ్‌రోజు తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందనలు వినిపించాయి. కథేం ఉంది? ఇంటర్వెల్‌లో ఆసక్తి ఏం ఉంది? క్యారెక్టర్లన్నీ అసంపూర్ణంగా ఉన్నాయే? అంటూ చాలామంది పెదవి విరిచేశారు. అయితే వీటన్నిటిలోనూ ఓ ప్రధాన కారణం రాజమౌళి అభిమానుల్ని నిరాశపరిచింది. ఎందుకంటారూ?

అసలు రాజమౌళి సినిమా అంటేనే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో ఏదో ఓ కొత్తదనం, కుర్చీ అంచుమీద కూచుని చూసే ట్విస్టుని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. సింహాద్రి, ఛత్రపతి నుంచి అది కొనసాగుతున్న సాంప్రదాయం. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో ఎమోషన్‌, యాక్షన్‌ పీక్స్‌లో చూపించిన ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. కానీ ఈసారి బాహుబలిలో ఏమాత్రం టెన్షన్‌ పెట్టకుండా చాలా సింపుల్‌గా ఇంటర్వెల్‌ని తేల్చేశాడు. దాంతో అతడి ఫ్యాన్స్‌ డిజాప్పాయింట్‌ అయ్యారు. అదర్‌వైజ్‌.. సినిమా సూపర్బ్‌!!