Begin typing your search above and press return to search.
చైతూ నిశబ్దానికి కారణమేంటో..!
By: Tupaki Desk | 19 May 2021 7:00 AM ISTయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'లవ్ స్టోరీ' సినిమాని పూర్తి చేసిన చైతన్య.. ప్రస్తుతం 'థాంక్యూ' అనే మూవీలో నటిస్తున్నారు. ఇదే క్రమంలో చైతూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అమీర్ ఖాన్ - కరీనా కపూర్ జంటగా నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటించనున్నారు. విజయ్ సేతుపతి తప్పుకోవడంతో ఆ పాత్ర చైతూ దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి రోజుకో వార్త వస్తూనే ఉన్నా చైతన్య మాత్రం సైలెంటుగానే ఉంటున్నాడు.
'లాల్ సింగ్ చద్దా' సినిమాలో నటిస్తున్నానని చెప్పలేదు.. అలాగని ఇంతవరకు ఆ వార్తలను ఖండించలేదు. దీనికి కారణమేంటనేది తెలియనప్పటికీ, ఇదే ఈ సినిమాలో చై పాత్రపై క్యూరియాసిటీ మరింత పెంచోస్తోంది. మరి ఈ సినిమా అక్కినేని హీరో కెరీర్ కి ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి. కాగా, అద్వైత్ చందన్ దర్శకత్వంలో 'లాల్ సింగ్..' తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జూన్ లో లడఖ్ లో ప్రారంభం కానుంది. ఇందులో చైతన్య కూడా జాయిన్ అవుతారని సమాచారం.
ఆస్కార్ విజేత టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో వచ్చిన హాలీవుడ్ సినిమా 'ఫారెస్ట్ గంప్'(1994) రీమేక్ గా 'లాల్ సింగ్..' రూపొందుతోంది. ఇందులో బెంజమిన్ బుఫోర్డ్ బ్లూ పాత్రనే చైతన్య చేయనున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని 2021 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఏదేమైనా నాగచైతన్య కూడా తన తండ్రి 'కింగ్' నాగార్జున బాటలోనే నడుస్తున్నాడని అర్థం అవుతోంది. నాగ్ తెలుగులో హీరోగా చేస్తున్న క్రమంలోనే అవకాశం వచ్చినప్పుడు హిందీలోనూ నటించారు. ప్రస్తుతం ఆయన 'బ్రహ్మాస్త్ర' అనే హిందీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.